India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాలమూరు యూనివర్సిటీలో సెమినార్ హాల్లో జాతీయ సేవా పథకం దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. రేపు జాతీయసేవ పథకం దినోత్సవం వేడుకలలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన,ఉపన్యాస,పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతులు ప్రదానం చేయనున్నారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అర్జున్ కుమార్,డాక్టర్ ఈశ్వర్ కుమార్,డాక్టర్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 315 దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ప్రతి మండపం వద్ద నిర్వాహకులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ పాయింట్ బుక్స్ ఏర్పాటు చేస్తామని, తనిఖీలకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో దుర్గా నవరాత్రులు, బతుకమ్మ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.జానకి తెలిపారు. మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్‌టీజింగ్ జరగకుండా ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టామన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన వివిధ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అత్యధికంగా బాలానగర్ మండలం ఉడిత్యాల 97.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. నవాబుపేట మండలం కొల్లూరు 71.5, మహబూబ్ నగర్ గ్రామీణ 50.5, గండీడ్ మండలం సల్కర్ పేట 47.3, భూత్పూర్ 31.3, కోయిలకొండ మండలం పారుపల్లి 24.3, మహమ్మదాబాద్ 19.3, హన్వాడ 18.5, మిడ్జిల్ 9.5, అడ్డాకుల 5.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

MBNRలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ప్రేమ్‌నగర్ ప్రాంతంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా విస్తృతమైన కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 300 ఇండ్లను తనిఖీ చేసి,192 ద్విచక్ర వాహనాలు,16 ఆటోలు,17 కారులు పత్రాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 32 బైక్‌లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకుని PSకు తరలించారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు,CI అప్పయ్య పాల్గొన్నారు.

ఉమ్మడి MBNRలోని ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్లకు వాక్ ఇన్ అడ్మిషన్లకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ బి.శాంతయ్య Way2Newsతో తెలిపారు. ప్రభుత్వ ITI/ATC, ప్రైవేట్ కాలేజీలలో ఈ నెల 30 వరకు 4వ విడత స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని 1, 2, 3 విడతలలో అప్లై చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తవారు ఆన్లైన్లో అప్లై చేసుకుని అదే రోజు వెరిఫికేషన్‌కి రావాలన్నారు.

దసరా సెలవుల్లో ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు దొంగతనాలు, చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని SP డి.జానకి సూచించారు. అదనపు గస్తీని పెంచడం ద్వారా క్రైమ్ రేటును తగ్గిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా కాలనీలు, షాపింగ్ మాల్స్‌లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంలో భద్రత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ ఆలిండియా యూనివర్సిటీ కబడ్డి, ఆర్చరి (స్త్రీ, పురుషుల విభాగంలో) ఎంపికలు ఉంటాయని యూనివర్సిటి PD డా. వై. శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. ఈనెల 23న పాలమూరు యూనివర్సిటీలోని పీజీ కళాశాల గ్రౌండ్లో కబడ్డి (స్త్రీ,పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోపు ఉండాలి, ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతోపాటు ఎలిజిబుల్ ఫామ్ పై ప్రిన్సిపల్/PD సంతకం ఉండాలన్నారు.

దసరా పండుగ సందర్భంగా అదనపు బస్సులు నడుపుతున్నట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికుల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చేనెల రెండు వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, 10 డిపోలలో 641 అదనపు బస్సులను నడుపుతున్నామన్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక వాలంటరీలను, తాగునీటి వసతి ఏర్పాటు చేశామన్నారు.
SHARE IT

మహబూబ్‌నగర్ జిల్లాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకొండపై స్వయంభువుగా వెలసిన శ్రీరాముడి జాతర ఆదివారం జరగనుంది. సంవత్సరంలో అరుదుగా వచ్చే ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నారు. ఈ కొండపై లభించే ఏ వనమూలికలైనా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు.
Sorry, no posts matched your criteria.