India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలమూరు వాసులు మద్ది అనంతరెడ్డి, మద్ది యాదిరెడ్డి కలిసి జిల్లా ఎస్పీ జానకికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్కును ఎస్పీకి అందించారు. పట్టణంలో భద్రతను పెంపొందించేందుకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పట్టణంలో బుధవారం ఆయన నీట్, ఎంసెట్ కోర్సులో చేరిన విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో నీట్, ఎంసెట్ కోర్స్‌ను అందిస్తున్నారు. మహబూబ్‌నగర్ బిడ్డలు ఎందులోనూ తక్కువ కాదని, ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారని ఆయన అన్నారు.
మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కుమారస్వామిని ఢిల్లీలో బుధవారం కోరారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేశ్ కుమార్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి బుధవారం ఆయన వినతిపత్రం ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఇక్కడి ప్రజలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
ఆస్తి పన్ను వసూళ్లను 100% అధిగమిస్తామని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. ప్రతిరోజు ముమ్మరంగా వసూళ్లు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి 100%వసూళ్లే టార్గెట్‌గా చేసిన ప్రయత్నాలు 47% శాతానికి పరిమితమై గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ శాఖ ఈసారి 50% కూడా చేయలేకపోయింది.
బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కోరారు. ఏప్రిల్ 5వ తేదీన జగ్జీవన్ రామ్, 14వ తేదీన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత సంఘాల ప్రతినిధులు అధికారులతో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీనివాస్‌ను బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ బుధవారం కోరారు. అలాగే పాలమూరు విశ్వవిద్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే అధ్యయన కేంద్రాన్ని కూడా నెలకొల్పాలన్నారు. ఈ అధ్యయన కేంద్రం ద్వారా జ్యోతిరావు ఫూలే ఆశయాలను కొనసాగించడానికి వీలవుతుందని వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ 1961 అమలులో ఉంటుందని ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. పోలీసుల అనుమతులు లేకుండా ఎటువంటి మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. నిషేధిత కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు వాడకూడదన్నారు. డీజేలు లౌడ్ స్పీకర్లను కూడా పూర్తిస్థాయిలో నిషేధించామన్నారు.
ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.
Sorry, no posts matched your criteria.