India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి అనుమతులను గడువులోగా మంజూరు చేయాలని కలెక్టర్ విజేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ బ్రైడ్ కింద షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఆరుగురికి వాహన పెట్టుబడి సబ్సిడీ మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ వెల్లడించారు.

రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన వారికి కేటాయించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని పాలమూరు విశ్వవిద్యాలయం బీసీ అధ్యాపకులు డిమాండ్ చేశారు. గురువారం రిజర్వేషన్ల అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు సమక్షంలో చర్చా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అమలు చేయాలని కోరారు. విశ్రాంత చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీయూ ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు బత్తిని రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 4 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని విడతలవారీగా విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం ముఖద్వారం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.

ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై మహబూబ్‌నగర్ జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(డీఐఈవో) కౌసర్ జహాన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు యూడైస్, ఆపార్ జనరేట్ చేస్తేనే వార్షిక పరీక్షకు అర్హులని, లేనిపక్షంలో అనర్హులు అవుతారని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని చెప్పారు.

ఆర్టీసీ సమస్యలపై మహబూబ్ నగర్ డిపో ఆధ్వర్యంలో ఇవాళ డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ సుజాత తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలను సలహాలను, సూచనలను గురువారం మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు తెలుపాలన్నారు. 99592 26295 చరవాణి నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలను వివరించాలన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 30.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. భూత్పూర్ 24.3, మూసాపేట మండలం జానంపేట 20.5, హన్వాడ 19.5, మహబూబ్ నగర్ అర్బన్ 17.0, మిడ్జిల్ 16.0, మహమ్మదాబాద్ 15.8, బాలానగర్ 13.3, దేవరకద్ర 12.8, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 10.8 అడ్డాకుల 8.5, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలోని వినియోగదారుల కోర్టు ప్రాంగణంలో భారీ వర్షం కారణంగా నీరు చేరింది. 2 రోజుల కురిసిన వర్షంతో కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. వర్షం నీరు రాకుండా తగిన డ్రేనేజీ వ్యవస్థ లేనందున బుధవారం కూడా నీరు తగ్గకపోవడంతో కోర్టు కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొత్త భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మహమ్మదాబాద్ మండలంలోని నంచర్ల గేట్ బస్టాండ్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న కారు-బొలెరో ఢీకొనడంతో కారులో ఉన్న విష్ణు, మల్లేష్, శేఖర్‌కు గాయాలయ్యాయి. బొలెరోలో కర్నూలుకు వెళుతున్న రోషన్‌కు కూడా తలకు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ మెహబూబ్ బాషా, పైలట్ అక్బర్ అక్కడే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఉమ్మడి జిల్లాలోని MBNR, GDWL, WNPT,NRPT జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?
Sorry, no posts matched your criteria.