India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రేమ వ్యవహారంలో అబ్బాయి తల్లిని చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటన ఇటిక్యాల మం. వేముల గ్రామంలో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. తన కుమార్తెను గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడని ఆ యువకుడి తల్లి మారెమ్మపై యువతి తరఫున వారు దాడిచేశారు. స్థానికులు పోలీసులకు తెలపగా వారు చేరుకుని ఆమెను విడిపించారు. ఈ మేరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వేసవిలో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా వారికి ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులు ఆదేశించారు. కోయిలకొండ మండల పరిధిలోని సంగనోని పల్లి సేరి వెంకటాపూర్ గ్రామాల్లో రైతులు వేసిన వేసవి పంటలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. వేసవి ఎండలకు నీటి జలాలు ఇంకి పోయి బోరు లో నీరు సరిపడినంత లేక పాక్షికంగా విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించారు.
కేజీబీవీ పాఠశాలలోని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే పరిశీలించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. కోయిలకొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలను మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు విద్యార్థులుకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్ రుచిచూసి భోజనంపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలెక్టర్ దృష్టికి వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు. 37 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వడదెబ్బ తలిగే అవకాశం ఉందని, మధ్యాహ్నం తర్వాత బయటికి రాకపోవడమే మంచిదంటున్నారు. గత వారం రోజుల నుంచి రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ధర్మాపూర్ గ్రామంలో రూ.40 లక్షలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన డి.ఉదయ్ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మూడా కార్యాలయంలో మూడా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, పర్ణిక రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముడా అధికారులపై పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.
Sorry, no posts matched your criteria.