India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి గజవాహన సేవ నిర్వహించారు. వారం రోజుల పాటు వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి.

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ శివారులో శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో స్వామివారి దిగుడుమెట్లు దాతల సహకారంతో బుధవారం ప్రారంభించారు. దేవాలయం ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సత్యనారాయణ, శ్రీనివాసులు ఆలయ సిబ్బంది ఆర్.శివానంద చారి, భాస్కర చారి తెలుగు శ్రీనివాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో పోటీచేసే SC,ST,BC అభ్యర్థులు రూ.1,250,ఇతరులు రూ.2,500 డిపాజిట్ చేయాలి. అదేవిధంగా కార్పొరేషన్లలో పోటీచేసే రిజర్వ్డ్ కేటగిరీఅభ్యర్థులు రూ.2,500, జనరల్ రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లు పొందే అభ్యర్థులు నామినేషన్ ఫారంతోపాటు తప్పనిసరిగా కుల ధ్రువీకరణపత్రాన్ని జతచేయాలి.

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ శ్రీ అళహరి మధుసూదన్ Way2News తెలిపారు. భక్తులు నిర్దేశించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలుపాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ మినీ బస్సు సర్వీసు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ బుధవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, 18 మున్సిపల్స్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 30 వరకు నామినేషన్స్ దాఖలు. 31న వాటిని పరిశీలన. ఫిబ్రవరి 3 నామినేషన్ల ఉపసంహరణ. ఫిబ్రవరి 11 పోలింగ్. ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫిబ్రవరి 16 మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది.

పాలమూరు కొత్త కార్పొరేషన్‌కు మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ బీసీ మహిళకు రిజర్వేషన్ కావడంతో తమ అభ్యర్థులను బరిలో నింపేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. తొలి మేయర్ పీఠం కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో 5 మంది హోరాహోరీగా పోటీ పడుతుండగా, బీఆర్ఎస్, BJPలో మేయర్ అభ్యర్థి ఎవరు అనే దానిపై స్పష్టత రాలేదు. మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు వేచి చూడాల్సిందే.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో కొలువుదీరిన మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 700 మందికి పైగా పోలీస్ బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజులపాటు ఏ ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులను దృష్టిలో ఉంచుకొని కోనేరు సమీపంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ <<18974641>>ఎన్నికలకు నోటిఫికేషన్<<>> విడుదలైంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 60 డివిజన్లలో 1,97,841 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 96184 మంది ఉండగా మహిళా ఓటర్లు కూడా ఇంచుమించుగా అదే సంఖ్యలో ఉన్నారు. ఈ కార్పొరేషన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడం తెలిసిందే. ఇక ఫిబ్రవరి 11న ఎన్నికలు, 13న ఫలితాలు వెలువడనున్నాయి.

పాలమూరు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మూడో సెమిస్టర్ పరీక్షా కేంద్రాలను మంగళవారం ఉపకులపతి (VC) శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.