Mahbubnagar

News January 21, 2026

మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

image

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.

News January 20, 2026

మన్యం కొండ బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

image

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రథోత్సవం శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

News January 20, 2026

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

News January 20, 2026

మహబూబ్‌నగర్‌లో అగ్నిప్రమాదం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

News January 20, 2026

జిల్లాలో చలి పంజా.. రాజాపూర్‌లో 11.8 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్‌ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

News January 19, 2026

మన్యంకొండ ఆలయ హుండీ ఆదాయం రూ.35.77 లక్షలు

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.35,77,912 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, గ్రంథాలయ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

News January 19, 2026

​మహబూబ్‌నగర్: టీచర్ల కాంప్లెక్స్ సమావేశాలు వాయిదా

image

రిపబ్లిక్ డే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వాయిదా వేయాలని డీఈఓ కార్యాలయ ఏడీ అనురాధకు టీఎస్‌యూటీఎఫ్ (TSUTF) నాయకులు వినతిపత్రం ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు, వేడుకల అనంతరం సమావేశాలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం పట్ల యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 19, 2026

మహబూబ్‌నగర్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం ఇచ్చే ఐదు నెలల ఉచిత శిక్షణ కరపత్రాలను కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. డిగ్రీ అర్హత గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 30లోగా https://www.tsstudycircle.co.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News January 19, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

భూత్పూర్ మండలం తాటికొండ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<18892567>>ప్రాణాలు<<>> కోల్పోయాడు. SI చంద్రశేఖర్ వివరాలు.. కోయిలకొండ మండలం కొతలబాద్‌కు చెందిన రవికుమార్(26) తన స్నేహితుడిని కలిసేందుకు బైక్‌పై వెళ్తుండగా అన్నాసాగర్‌కు చెందిన ఆకాశ్ బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితమే వివాహం కాగా, బాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 18, 2026

జడ్చర్ల: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దురదృష్టకరం: లక్ష్మారెడ్డి

image

మాజీ మంత్రులు హరీశ్ రావు, KTRలపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతలను మారీచుడు, సుబాహుడు అని సంబోధించడం, “నడుం విరగ్గొడతా” అని మాట్లాడటం నీచమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలోనే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు వచ్చాయని, ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లతో ప్రాజెక్టులు నిర్మించామని గుర్తుచేశారు. తాము ఎన్నడూ అభివృద్ధికి అడ్డుపడలేదని స్పష్టం చేశారు.