India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సౌత్ జోన్‌లో పాల్గొనేందుకు PU క్రాస్ కంట్రీ (స్త్రీ,పురుషుల) ఫిబ్రవరి 3న యూనివర్సిటీలోని సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్‌లో నిర్వహిస్తున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్య అతిథిగా VC ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్,రిజిస్టర్ పూస రమేష్ బాబు హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు ఉన్న క్రీడాకారులు అర్హులని,ప్రిన్సిపల్ సంతకంతో కూడిన బోనఫైడ్, ఎలిజిబిలిటీ ఫామ్‌ను తీసుకొని రావాలన్నారు.

నందినగర్‌లోని కేసీఆర్ నివాసం ఆదివారం రాజకీయ చర్చలకు వేదికైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి గులాబీ బాస్‌తో భేటీ అయ్యారు. విచారణ వివరాలతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

మహబూబ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఎంపీ డీకే అరుణ తన నివాసంలో ఇన్‌ఛార్జ్‌లతో కీలక సమావేశం నిర్వహించారు. 14 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో గెలుపు వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరి 4న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక నేపథ్యంలో కార్యకర్తల సమావేశ ఏర్పాట్లను ఆమె సమీక్షించారు.

బాలకార్మికులను పనుల్లో పెట్టుకున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని, 54 కేసులు నమోదు చేసినట్లు SP జానకి తెలిపారు. విముక్తి పొందిన పిల్లలను CWCకి అప్పగించామని, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను తిరిగి చదువుల్లో చేర్పించాలని సూచించినట్లు పేర్కొన్నారు. బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారమివ్వాలన్నారు.

బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమంలో భాగంగా.. గత నెలలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. మొత్తం 83 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించాం, వీరిలో 7 మంది బాలికలు,76 మంది బాలురు ఉన్నారని వెల్లడించారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువై తెలంగాణ తిరుపతిగా పేరొందిన మన్యంకొండ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు తేరు కావడంతో చుట్టూ ప్రక్క గ్రామాల భక్తులు ఇతర జిల్లాల నుంచి చాలా మంది మన్యంకొండకు తరలివస్తున్నారు. కొండ పైన స్నానానికి కోనేరు, ఉచిత దర్శనం, భోజనం, మరుగుదొడ్లు, పోలీస్ ఆరోగ్య సిబ్బంది,108 వాహనాల సౌకర్యం కూడా కల్పించారు. మరి మీరు కూడా వస్తున్నారా కామెంట్ చేయండి.

పాలమూరు మున్సిపాలిటీ ఎన్నికల వేళ అధికార పార్టీలో వర్గ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు ద్వేషం అనే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. 60 డివిజన్లకు కాంగ్రెస్ ఆశావహులు 328 మంది నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో పార్టీ నేతలు టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల మధ్య ఏకాభిప్రాయం కుదిర్చే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయిందని తెలిసింది.

దేవరకద్ర మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి అంశం ప్రధాన రాజకీయ చర్చగా మారింది. ఈ బ్రిడ్జి మంజూరు కావడంలో ఎంపీ డీకే అరుణ కీలక పాత్ర పోషించారని బీజేపీ శ్రేణులు పేర్కొంటుండగా, అదే సమయంలో ఈ ప్రాజెక్ట్ సాధ్యమయ్యేందుకు ఎమ్మెల్యే జీఎంఆర్ కృషే ప్రధానమని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి. ఇరువురి మధ్య SMలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

మహబూబ్‌నగర్ జిల్లాలో 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలులో ఉందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ మేరకు ఇతర వ్యక్తులను గానికి, రాజకీయ పార్టీలను గాని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా, సామాజిక మాద్యమాలలో పోస్టులు పేటిన చట్టరిత్య కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఫిబ్రవరి 1నుంచి 28వరకు నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరదాని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టంకల్గించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ సూచించారు.
Sorry, no posts matched your criteria.