India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. వన్ టౌన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శనివారం సందర్శించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల వేళ ప్రత్యేక నిఘా కొనసాగించాలని, భద్రతలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నితిన్ నబిన్ ఫిబ్రవరి 4న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్నారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఉమ్మడి జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ శనివారం సభా స్థలాన్ని పరిశీలించి, జాతీయ అధ్యక్షుడి హోదాలో నితిన్ నబిన్ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో శనివారం అధికారులు పత్రాల పరిశీలన చేపట్టారు. అసంపూర్తి సమాచారం, సాంకేతిక లోపాలు ఉంటే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కాగా పాలమూరు కార్పొరేషన్‌కు 579, దేవరకద్ర 86, భూత్పూర్ 96 నామినేషన్లు రాగా, WNP జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు 812, NRPT 541, GDL 525, NGKL 521 నామినేషన్లు దాఖలయ్యాయి.

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల చెరువులో గల్లంతైన తిమ్మాజీపేట మండలం మామిడిచెట్టు తండాకు చెందిన రమేష్ మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఇనుము కోసం చెరువులోకి వెళ్లి రమేష్ గల్లంతవగా, అగ్నిమాపక శాఖ అధికారి రాజేందర్ బృందం గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం ఎస్పీ డి.జానకి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపాలిటీల్లోని కేంద్రాలను సందర్శించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు, అనుచరులు శాంతియుతంగా సహకరించాలని కోరారు.

మహబూబ్ నగర్ నగరపాలికలోని 60 డివిజన్‌లు ఉన్నాయి. అందులో బీజేపీ 43 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇంకా పలువురుని ఖరారు చేసే ఆలోచనలో ఉందని సమాచారం. ఇందులో తమకు టికెట్ దక్కని వారు ఇలాంటి ఆవేదనకు గురి కావద్దని తమ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ జిల్లా నాయకులు చెబుతున్నారు.

MBNR :ఎస్సీ స్టడీ సర్కిల్ నందు 5 నెలల ఉచిత శిక్షణకు (GROUP-1,2,3&4 BANKING, SSC, RRB,) నేటితో గడువు ముగియనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో డిగ్రీ అర్హత గల SC, ST, BC, and Minority అభ్యర్థులు https://www.tsstudycircle.co.in” నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఎంపికైన వారికి 5 నెలల పాటు ఉచిత భోజనం, వసతి, Books, నిష్ణార్థులైన అధ్యాపకులచే బోధన ఉంటుందన్నారు.

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసే అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఖరారు చేసే పనిలో పడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ ఉండనుండగా ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించాయి. ప్రధానంగా సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయకపోవడంతో ‘భీ’ ఫారాలు అందజేయలేదు.

మహబూబ్ నగర్ జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం చేత గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్ చేయరాదని డీఈవో ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేముందు గుర్తింపు ఉన్నదా లేదా అని తెలుసుకోవాలన్నారు.

మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సందర్భంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయనిదేవితో కలిసి కలెక్టర్ నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నామినేషన్లు స్వీకరించే ముందు అభ్యర్థులు ఏయే ధ్రువీకరణ పత్రాలు జతచేయాలో చెక్ లిస్ట్ స్పష్టంగా అర్థమయ్యేలా ప్రదర్శించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.