India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 60 డివిజన్లకు గాను మొత్తం 347 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో ఏకంగా 127 మంది స్వతంత్ర అభ్యర్థులే ఉండటం విశేషం. పార్టీల వారీగా కాంగ్రెస్ 60, బీఆర్ఎస్ 58, బీజేపీ 52 స్థానాల్లో పోటీలో ఉండగా.. ఎంఐఎం, జనసేన, బీఎస్పీ కూడా బరిలో ఉన్నాయి. స్వతంత్రుల పోటీ పెరగడంతో ప్రధాన పార్టీలలో ఉత్కంఠ నెలకొంది.

జిల్లాలో బాల కార్మికత్వ నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్-XII’లో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ డి.జానకి అభినందించారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. నోడల్ అధికారిగా సమర్థవంతంగా పనిచేసిన ఏఎస్పీ ఎన్.బి.రత్నంను ప్రత్యేకంగా అభినందించారు. బాలల ఉజ్వల భవిష్యత్తు కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

జడ్చర్ల మండలం నాగసాల సమీపంలోని మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆదివారం పాఠశాలలో చీటీ రాసి తాము ఐదేళ్ల తర్వాత వస్తామని అదృశ్యమయ్యారు. ప్రిన్సిపల్ ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు విచారణ నిర్వహించి విద్యార్థులు ముంబైలో ఉన్నట్లు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించి విద్యార్థులను పట్టుకున్నారు. విద్యార్థులను తీసుకురావడానికి వారి తల్లిదండ్రులు పోలీసులు ముంబైకి వెళ్లారు.

మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన వేళ అధికార కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన ఖాతాను తెరిచింది. పాలమూరు కార్పొరేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. రాజేంద్రనగర్ ప్రాంతంలోని 58వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి ఎన్నిక లాంఛనమైంది. ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీ జెండా ఎగిరింది.

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రలోభాలకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ఎస్పీ జానకి హెచ్చరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ ఆమె ఛాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక శక్తులపై నిఘా పెంచాలని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీస్ బలగాలను సిద్ధంగా ఉంచాలని ఎస్పీ సూచించారు.

మహబూబ్‌నగర్ జిల్లా నందు జరగనున్న మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, భూత్పూర్ మున్సిపల్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలపై దృష్టి సారించింది. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ డి.జానకి సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. గెలుపే లక్ష్యంగా తమ మద్దతుదారులతో కలిసి వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 3 వరకు గడువు ఉండడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు.

గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపాలని స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇప్పటికే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. కానీ వికారాబాద్ సరిహద్దులో ఉంటూ అభివృద్ధి కోసం, పాలనా సౌలభ్యం కోసం జిల్లా మార్పు ఆవశ్యకమని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికి SBI, RSETI ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. నేటి నుంచి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది. ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. 19-45 ఏళ్ల లోపు ఉన్నవారు టెన్త్ మెమో,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్, 3 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ డి.జానకి విజ్ఞప్తి చేశారు. బాల కార్మికత్వం సమాజానికి ముప్పుగా మారుతోందని, పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ తరహా అక్రమాలపై ఇకపై కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరిస్తూ.. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. SHARE IT
Sorry, no posts matched your criteria.