India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్‌నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండలం ఉడిత్యాల, మిడ్జిల్ మండలం దోనూరు గ్రామాల్లో అత్యంత కనిష్ఠంగా 13.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 14.2, జడ్చర్లలో 14.6 డిగ్రీలుగా ఉంది. రాత్రి వేళల్లో చలి గాలులు తీవ్రమవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. ఎన్నికల్లో పీవో, ఏపీవోల పాత్ర కీలకమని అన్నారు. పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు 36 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.

✒ పరీక్షల షెడ్యూల్ విడుదల
✒ డిగ్రీ రీవాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
✒ పుట్ట గొడుగు తయారీలో ఉచిత శిక్షణ
✒ పాలమూరుకు సీఎం వలస వచ్చారు: డీకే అరుణ
✒ ఫైనల్‌కు చేరిన పాలమూరు జట్టు
✒ పాలమూరు మున్సిపల్‌లో త్రిముఖ పోరు
✒ ఎన్నికల తర్వాత జిల్లాను రద్దు చేస్తారు: రాజేందర్ రెడ్డి
✒ పాలమూరు: బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు 63,430 మంది రైతులు 25,675 యూరియా బస్తాలను బుక్ చేసుకొని కొనుగోలు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ వెల్లడించారు. 11,892 యూరియా బస్తాలు ఇంకను రైతులకు బుక్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉన్నాయని, రైతు తనకు అందుబాటులో ఉన్న మండలం, డీలర్‌ను ఎంచుకుని బుకింగ్ చేసుకోవాలని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదన్నారు.

పాలమూరు యూనివర్సిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్–I,II, పోలీస్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డా మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ తరగతులు పీజీ కళాశాల సెమినార్ హాల్‌లో ఉదయం 6.30–8.30, సాయంత్రం 5.00–8.00 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 6న సాయంత్రం 5.00 గంటలకు హాజరుకావాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.భూమయ్య పేర్కొన్నారు.

✒PU.. డిగ్రీ ఫలితాలు విడుదల
✒MBNR: మున్సిపల్ ఎన్నికల పీసీసీ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
✒పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి
✒PMను కలిసే అవకాశం..రిజిస్ట్రేషన్ చేసుకోండి
✒పాలమూరు: తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ
✒మెట్టుగడ్డ మార్కెట్‌పై కాంగ్రెస్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒మున్సిపల్ ఎన్నికలు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం

పాలమూరు విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనములో యూనివర్సిటీ ఉపకులపతి
ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కే.ప్రవీణ డిగ్రీ 1వ సెమిస్టర్(30.08%), 3వ సెమిస్టర్ (39.72%), 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.

పదో తరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పదో తరగతి ఎస్.సి.సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గురువారం అంబేడ్కర్ కళా భవన్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల పై ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

నూతన బడ్జెట్ పై క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యువజన అధికారి వి.కోటా నాయక్ “Way2News” ప్రతినిధితో తెలిపారు. ప్రతిభ కనబరిచిన యువతి, యువకులు జాతీయస్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహించి, నేరుగా ప్రధానమంత్రిని సంభాషించే అవకాశం భారత ప్రభుత్వం కల్పిస్తుందని, 15-29 వయస్సు గలవారు అర్హులని, ఆసక్తి గల యువత https://mybharat.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. SHARE IT

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల వారికి SBI, RSETI ఆధ్వర్యంలో తేనెటీగల పెంపకం కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 7 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, ఉచిత భోజనం, వసతి ఉంటుందన్నారు. 19-45 ఏళ్ల లోపు ఉన్నవారు టెన్త్ మెమో,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్,3 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.