India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్(D) గండీడ్ మండలం వెన్నాచేడ్ ఆదర్శ పాఠశాలలో (మోడల్ స్కూల్) చేరెందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా “Way2News” ప్రతినిధితో తెలిపారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7,8,9,10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, https://tgms.telangana.gov.in వెబ్ సైట్‌లో ఈనెల 28లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.SHARE IT.

మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ థావుర్యనాయక్ తెలిపారు. డ్యూటీ చార్ట్ వేసి ఫోన్ నంబర్‌లను పోలింగ్ సెంటర్ల వద్ద అతికించామని, అంతరాయం ఏర్పడితే..
✒AE టౌన్-1: 87124 72160
✒AE టౌన్-2: 87124 72161
✒AE టౌన్-3: 87124 72162
✒ADE టౌన్: 87124 72156లకు ఫోన్ చేయాలన్నారు.

మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు జామ్ రవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. రవి జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో స్నానం చేయడానికి హీటర్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 డివిజన్లు, 316 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా గెలవాలని పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ సిద్ధమయ్యారు. పోటీ ఎక్కువగాలేని వార్డుల్లో ఓటుకు రూ.500 వరకు పంచుతున్నట్లు తెలిసింది. త్రిముఖపోటీ ఉన్నచోట రూ.2 వేలు, ద్విముఖపోరు ఉన్నచోట్ల రూ.1500 చొప్పున ఓటుకు నోటు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే ఈ ప్రక్రియకు తెరలేపినట్లు సమాచారం.

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు “Way2News”తో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనఫైడ్‌పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 లోపు వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎస్పీ డి.జానకి స్పందిస్తూ.. ప్రచార సమయం ముగిసిన వెంటనే బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు జిల్లా విడిచి వెళ్లాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్,18మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. ఫిబ్రవరి 3న మొదలైన ఎన్నికల ప్రచార హోరు రేపు సాయంత్రం ముగియనుంది. ప్రచారానికి రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని పార్టీల అగ్రనేతలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 5నుంచి 6కార్నర్ మీటింగ్ లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంచేస్తున్నారు.

ఎన్నికల విధులలో పాల్గొనే మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రామంజుల రెడ్డి కోరారు. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని మెప్మా భవనంలో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆదివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు.

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు Way2Newsతో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనాఫైడ్ పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సహా భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల నిల్వ కోసం ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ యార్డు వద్ద వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.