India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దసరా పండుగ సందర్భంగా జమ్మి పత్రాలకు, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. జమ్మి పత్రాలకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు పుచ్చుకొని అలైబలై చేసుకోవడం ద్వారా శత్రుత్వం కోల్పోతుందన్నారు. పాలపిట్టను చూడడం ద్వారా అపజయాలు కోల్పోయి విజయాలు దరిచేరుతాయని, పల్లెల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పొలాల వెంబడి వెళ్లి పాలపిట్టను చూస్తారని పండితులు తెలిపారు.
రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వస్తుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం సొంత ఇంటి దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిపూజలో పాల్గొంటారు. రాత్రి వరకు సీఎం ఊరిలోనే గడపనున్నట్లు సమాచారం.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నారాయణపేట జిల్లా దామరగిద్దలో 18.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా సల్కర్పేటలో 17.8 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 17.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో 15.0 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా అల్వాలపాడులో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA) ఆధ్వర్యంలో అండర్-23 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టును ఎంపిక చేస్తున్నట్లు మహబూబ్ నగర్ క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా Way2Newsతో మాట్లాడుతూ.. ఈనెల 14న ఎండీసీఏ మైదానంలో ఎంపికలు నిర్వహిస్తామని,ఆసక్తిగల క్రీడాకారులు జనన ధ్రువీకరణ,ఆధార్ కార్డు,తెల్లటి క్రీడా దుస్తులతో హాజరు కావాలన్నారు.
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సారిగా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి నేడు వస్తున్నారు. దసరా పండగకు కుటుంబంతో స్వగ్రామానికి వచ్చే ఆనవాయితీ పాటించే రేవంత్రెడ్డి ఈ సారి సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రానున్నారు. CM రాక సందర్భంగా MLA వంశీకృష్ణ, కలెక్టర్ బదావత్ సంతోష్, కొండారెడ్డిపల్లి నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమేశ్ అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
గ్రామపంచాయతీలు మునిసిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అడిషనల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీలలో స్వయం సహాయక గ్రూప్ మహిళలను సభ్యులుగా చేర్చాలన్నారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇండ్ల విషయంలో లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై దృష్టిసారించి వసూల్ రాజాలుగా మారారని, ఇప్పటికే ప్రజలు గుర్తించారని MBNR ఎంపీ డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్వాడ BJP సభ్యత్వ నమోదులో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హాయంలో కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకుంటున్నారన్నారు.హైడ్రా పేరుతో వసూలుచేసి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆమె ఆరోపించారు.
MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Sorry, no posts matched your criteria.