Mahbubnagar

News January 7, 2026

MBNR: పీఎంశ్రీ క్రీడా పోటీలు.. విజేతలు వీరే!

image

మహబూబ్ నగర్ జిల్లాలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా!!
✒ కబడ్డీ (బాలుర)
1st- బాదేపల్లి, 2nd- గార్లపాడు
✒ కబడ్డీ (బాలికల)
1st- బాలానగర్, 2nd- వాపుల
✒ వాలీబాల్ (బాలుర)
విజేత- బాదేపల్లి, రన్నర్‌గా- వేముల
✒ వాలీబాల్ (బాలికల)
విజేత- బాలానగర్ (గురుకుల), రన్నర్‌గా-సీసీ కుంట(KGBV)

News January 7, 2026

MBNR: T20 లీగ్.. పాలమూరు విజయం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించిన ‘T20 కాకా స్మారక క్రికెట్ లీగ్’లో పాలమూరు ఘన విజయం సాధించింది. సిద్దిపేటలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన WGL జట్టు 20 ఓవర్లలో 142/7 పరుగులు చేసింది. MBNR జట్టు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. MBNR జట్టు ఆటగాడు అబ్దుల్ రాఫె-79* పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. వారిని MDCA ప్రధాన కార్యదర్శి రాజశేఖ్, కోచ్‌లు అభినందించారు.

News January 6, 2026

MBNR: చైనా మంజా విక్రయిస్తే ఫోన్ చేయండి: SP

image

ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్-100కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కి సమాచారం ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు వెల్లడించారు.

News January 6, 2026

MBNR: మున్సిపాల్ ఎన్నికలు.. ఈనెల 10న తుది జాబితా

image

రాబోయే రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వారీగా
ఈనెల 1న ఓటర్ ముసాయిదా జాబితా ప్రచురించారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాలో ఈనెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అభ్యంతరాలు పరిష్కరించి ఈనెల 10న తుది జాబితా ప్రచురించనున్నారు.

News January 6, 2026

MBNR: ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్.. APPLY NOW

image

జిల్లాలోని ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో కూడిన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిణి S.జరీనా బేగం తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఒక యూనిట్ కింద ముగ్గురు ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీలోగా జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 6, 2026

MBNR: అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్రం, గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం సబ్జెక్టులు బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్-ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రో కె పద్మావతి తెలిపారు. జనరల్ కేటగిరి అభ్యర్థులకు పిజీలో 55%, SC, ST అభ్యర్థులకు 50% ఉండలన్నారు. నెట్ సెట్, పీహెచ్డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

News January 6, 2026

ALERT.. చైనా మాంజా.. సమాచారం ఇవ్వండి: MBNR SP

image

ప్రజల ప్రాణాల రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని, చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నట్లు మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరించి చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా మానేయాలని, ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

News January 5, 2026

పాలమూరు: BRS మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను మంగళవారం ఉదయం 9:00 గంటలకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ముందుగా జూరాల ప్రాజెక్టు, ఎడుమ, కుడి కాలువలను పరిశీలించనున్నారు. అనంతరం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా సందర్శించనున్నారు.

News January 5, 2026

MBNR: పీయూ.. ఈనెల 7న క్రికెట్ ఎంపికలు

image

పాలమూరు యూనివర్సిటీ పురుషుల, స్త్రీల క్రికెట్ జట్ల ఎంపికలు ఈనెల 7న MBNRలోని ‘MDCA’ మైదానంలో జరగనుంది. సౌత్ జోన్ ఆలిండియా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు PD డా.వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ముఖ్యఅతిథిగా VC ప్రొ. జీఎన్.శ్రీనివాస్ హాజరుకానున్నారు. 17-25 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు అర్హులని, ఆసక్తి గల వారు బోనఫైడ్‌పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరుకావాలని సూచించారు.

News January 5, 2026

MBNR: ‘పీఎంశ్రీ’.. జిల్లా స్థాయి పోటీల షెడ్యూల్

image

మహబూబ్ నగర్ జిల్లా పీఎంశ్రీ పాఠశాల జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారులు సిద్ధం కావాలని ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. షెడ్యూలు ఇలా!
✒6న బాల,బాలికలకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు
✒6న బాల, బాలికలకు ఫుట్ బాల్ అథ్లెటిక్స్ పోటీలు
అథ్లెటిక్స్‌లో పాల్గొనే పియంశ్రీ పాఠశాల క్రీడాకారులు ఒక్క ఈవెంట్‌లో ఒక్కరు మాత్రమే పాల్గొనాలన్నారు.