India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల వారు తమ అసలు ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని ప్రకటనలో పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ మహిళా సమైక్య కార్యాలయంలో ఈ నెల 12న మహేంద్ర ఆటోమేటిక్ డిజైన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. సుమారు 200 ఖాళీలు ఉన్నాయని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3న సీఎం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో భాగంగా తొలి సభను పాలమూరులో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఉపాధిహామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసనతో పాటు, ఎన్నికల వ్యూహాలను ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో కుటుంబ కలహాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. పండ్ల వ్యాపారి విస్లావత్ రాములు (56)ను భార్య, పిల్లలే కలిసి కర్రలు, రాడ్లతో కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి గొడవ ముదరడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. నిందితులు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

MBNRలోని ‘DSA’ మైదానంలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు.
✒ఖో-ఖో (బాలుర భాగం)
1st place(జడ్పీహెచ్ఎస్ బాయ్స్ బాదేపల్లి)
2nd place(జడ్.పి.హెచ్.ఎస్ నవాబ్‌పేట్)
✒ఫుట్ బాల్(బాలుర విభాగం)
1st place (ZPHS రాజాపూర్)
2nd place (ZPHS బాయ్స్ బాదేపల్లి)
✒100 మీటర్స్ రన్నింగ్(బాలుర)
1st place పాల్ (ZPHS బాదేపల్లి)
2nd place కే.శ్రీనాథ్ (ZPHS నవాబ్‌పేట్)

✒ఖో-ఖో(బాలికల విభాగం)
1.1st place బాలానగర్
2.2nd place సీసీ కుంట
✒అథ్లెటిక్స్(బాలికల విభాగం)
1st place అనూష(జడ్పీహెచ్ఎస్ బాదేపల్లి)
2nd place హేమలత(టీజీఆర్ఎస్ బాలనగర్)
✒షాట్ పట్(బాలికల విభాగం)
1st place రమ్య(టీఆర్ఐఈఎస్ బాలానగర్)
2nd place కే.శ్రీవల్లిక(కేజీబీవీ సీసీ కుంట)
✒లాంగ్ జంప్ బాలికల
1st place జి.కావేరి (కేజీబీవీ భూత్పూర్)
1st place అక్షయ(జెడ్పీహెచ్ఎస్ నవాబ్‌పేట్)

పీఎంశ్రీ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు మహబూబ్‌నగర్‌లో రెండో రోజు ఘనంగా నిర్వహించారు. మొత్తం 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో బాలికలు, బాలురు విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యఅతిథిగా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి పాల్గొని బహుమతులు ప్రదానం చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

K12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో HYD,MBNR బ్రాంచ్ కోసం PROలు, PRM ఖాళీలు ఉన్నాయని పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఈనెల 8న క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్” నిర్వహిస్తున్నామని, పీయూలో MBA,MCA పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, పూర్తి వివరాలకు 98494 45877కు సంప్రదించాలన్నారు.

సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి నేషనల్ హైవే–44 పరిధిలోని బాలానగర్ ఫ్లైఓవర్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న కారణంగా ప్రయాణికులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.