Mahbubnagar

News August 22, 2024

పర్యాటకశాఖ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి సమీక్ష

image

మహబూబ్ నగర్ జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..నిర్దేశించిన సమయంలోగా చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు దృష్టి సారించాలని, మినీ ట్యాంక్ బండ్ ను దగ్గరలోఉన్న కాల్వ ద్వారా కృష్ణ నీటితో నింపాలని సూచించారు.

News August 21, 2024

ఇటిక్యాల: పాము కాటుకు బాలుడు మృతి

image

పాము కాటుకు బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం ఇటిక్యాల మండలం గోపాలదిన్నెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేణుగోపాల్ (9) మంగళవారం రాత్రి పడుకున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ల సలహాతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

News August 21, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యవార్తలు!!

image

✏నేతలు ఓటరు జాబితా సవరణకు సహకరించండి:MROలు
✏MBNR,NGKL జిల్లాల్లో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
✏పిల్లలమర్రిని పునః ప్రారంభించిన మంత్రి జూపల్లి
✏బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
✏భారత్ బంద్.. పలు నాయకులు అరెస్టు
✏కలకత్తా అత్యాచార ఘటన.. పలుచోట్ల నిరసన
✏వనపర్తి:కరెంట్ షాక్‌తో.. మహిళా మృతి
✏బస్సులో పుట్టిన ఆడబిడ్డకు జీవితకాల బస్‌పాస్ అందజేత
✏స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోండి:DEOలు

News August 21, 2024

MBNR, NGKL జిల్లాల్లో రేపు రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రేపు ఉదయం నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో MBNR,NGKL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. నేడు ఉదయం పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు.

News August 21, 2024

జేపీసీ కమిటీ తొలి సమావేశానికి బయలుదేరిన ఎంపీ

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంపీ డీకే అరుణ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి (JPC) తొలి భేటీలో పాల్గొనేందుకు ఆమె బుధవారం ఢిల్లీకి బయలుదేరారని ఆమె అనుచరులు తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలు, లోపాలు, రాష్ట్రాల వారీగా వక్ఫ్ భూముల వివరాల పర్యావసానాలు చర్చించనున్నారని, రేపు 11 గంటలకు పార్లమెంట్ హౌస్ లో తొలి భేటీలో పాల్గొన్నారు.

News August 21, 2024

కెనరా బ్యాంకు రైతులకు త్వరలో రుణమాఫీ: ఎమ్మెల్యే

image

కేశంపేట మండలంలోని కెనరా బ్యాంక్ ఖాతాదారులకు త్వరలోనే రుణమాఫీ అవుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. బ్యాంకులో సాంకేతిక కారణాల వల్ల 1054 మంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు కెనరా బ్యాంక్ అధికారులకు కలిసి రైతులకు సంబంధించిన వివరాలను అందజేసినట్లు చెప్పారు. రైతులందరికీ నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని అన్నారు.

News August 21, 2024

MBNR: నగదు కోసం స్నేహితురాలి దారుణ హత్య

image

అప్పులు తీర్చేందుకు స్నేహితురాలినే హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. DSP వెంకటేశ్వర్లు వివరాలు.. నవాబ్ పేట(M) అమ్మాపూర్‌కు చెందిన పద్మమ్మ, లక్ష్మమ్మ స్నేహితులు. APR 12న లక్ష్మమ్మ తలపై పద్మమ్మ రోకలితో కొట్టి హత్యచేసి నగలు, ఫోన్ చోరీ చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మృతురాలి ఫోన్లో సిమ్ వేయగా ఆచూకీ తెలుసుకొని రూ.23వేల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

News August 21, 2024

అయిజ: గుడిసె గోడ కూలి బాలిక మృతి

image

గుడిసె మట్టిగోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన ​​గద్వాల జిల్లా అయిజలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిజలో నర్సింహులు దంపతులు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసె గోడ తడిసి ముద్దయింది. మంగళవారం అర్ధరాత్రి అందరు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడకూలి బాలికపై పడింది. దీంతో బాలిక మృతి చెందింది. నరసింహులు భార్యకు గాయాలయ్యాయి.

News August 21, 2024

MBNR: రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్

image

జిల్లాలోని పలు మండలాల్లో రుణమాఫీపై ఫిర్యాదుల విభాగాల ఏర్పాటుతో పాటు ఆయా మండల స్థాయిలో ఒక నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు ఇన్‌ఛార్జ్ డీఏఓ వెంకటేశ్ తెలిపారు. ఉత్తర్వులకు అనుగుణంగా తమ మండలాల్లోని బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరించారు. రైతులు దరఖాస్తుతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రుణమాఫీ మొత్తం పొందే విధంగా చూస్తారు.

News August 21, 2024

NRPT:బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

image

చిన్నారులకు అందించనున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి జయ తెలిపారు. ఈ నెల 31 వరకు గడువు ఉందన్నారు. ఐదేళ్ల-18 ఏళ్ల వయసులోపు ఉన్న బాల బాలికలు వివిధ ఆవిష్కరణలు, క్రీడలు, సామజిక సేవ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం, కళలు, సంస్కృతిక రంగాలలో ప్రతిభ కనబర్చిన వారు అర్హులన్నారు.awards.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.