India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలనగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న మండల కేంద్రానికి చెందిన మణిదీప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణంపై ఎవరిపైన అనుమానం లేదని, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు.
MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.
LRS దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం విధించిన గడువు 3రోజుల్లో ముగియనుంది. కానీ దరఖాస్తులేమో 51,490 పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తుల్ని పరిష్కరించుకునే వారికి ప్రభుత్వం 25% రాయితీ ప్రకటించిన దరఖాస్తుదారుల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. వీరికి అవకాశం కల్పిస్తే తమకు ఆదాయం వస్తుందని భావించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. MBNRలో 29,390, జడ్చర్ల 16,500, భూత్పూర్ 5,600 ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి.
మహబూబ్నగర్ నుంచి తాండూర్ వెళ్లే రూట్లోని ఇబ్రహీంబాద్ వద్ద రహదారి మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. చకచకా పనులు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక నాయకులు పర్యవేక్షిస్తున్నారు.
ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్ఐ మాధవరెడ్డి తెలిపిన వివరాలు.. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వాసి అనిల్ గౌడ్ అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని Way2Newsతో గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. కోయిల్కొండ ఎమ్మార్వో, ఎస్ఐ వచ్చి ఊరు బయట నిల్వ ఉంచిన ఇసుకను సీజ్ చేశారు. వారికి గ్రామస్థులు థ్యాంక్స్ తెలిపారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు.
ఆయన పేదింటి యువకుడు.. తల్లిదండ్రుల కష్టం చూసిన అతడు GOVT స్కూల్లో చదువుతూనే ఎలాగైనా ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నారు. కష్టపడి చదివి సొంతంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నావికాదళంలో జాబ్ సాధించారు.ఆయనే వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తిపురం గ్రామ యువకుడు అశోక్.. తమ స్కూల్ పూర్వ విద్యార్థి అశోక్ జాబ్ కొట్టడం అభినందనీయమని మస్తిపురం ZPHS HMవెంకటన్న ఆయనను సన్మానించారు.
రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వాగు గుట్ట వద్ద మైనార్టీ సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నిర్వహిస్తున్న ఏర్పాట్లను మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైట్లు, కూలర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నారు. కార్యక్రమంలో నాయకుడు సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జాతీయ వ్యవసాయ మార్కెట్లో రైతన్నలు, వ్యవసాయ కూలీలకు నీళ్లు లేక వేసవి కాలంలో అలుమటిస్తున్నారు. మార్కెట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా, నీటి మూటలుగానే మిగులుతున్నాయని వారు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేసి వేసవిలో రైతులకు దప్పిక తీర్చాలని కూలీలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.