Mahbubnagar

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

News April 7, 2026

MBNR: రోడ్డు ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం!

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని ధర్మపూర్ సమీపంలో గల JPNCE కాలేజీ వద్ద మున్సిపల్ చెత్త వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం HYDకు తరలించారు. మిగిలిన ఇద్దరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి కాలు విరిగినట్లు సమాచారం. 108 అంబులెన్స్ సిబ్బంది స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించారు.

News April 7, 2026

MBNR: ఆ పదవికి ఫుల్ డిమాండ్.!

image

MBNR జిల్లాలోని 16 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, తమ జిల్లా తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవులకు భారీగా పోటీ ఏర్పడింది. మండల స్థాయిలో పట్టు సాధించేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News April 7, 2026

MBNR: సల్కార్‌పేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కార్‌పేటలో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర 39.9, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.6, చిన్న చింతకుంట 39.4, అడ్డాకుల 39.3, మిడ్జిల్ మండలం దోనూరు, నవాబుపేట 39.2, కౌకుంట్ల, కోయిలకొండ మండలం పారుపల్లి 38.9, భూత్పూర్ 38.8, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 6, 2026

ప్రజావాణి.. ప్రజల వినతులకు తక్షణ స్పందన: MBNR ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Grievance Day) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్ శాఖ ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.

News April 5, 2026

MBNR: బాబు జగ్జీవన్ జయంతి.. నివాళులు అర్పించిన ఎస్పీ

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బాబు జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విగ్రహానికి జిల్లా ఎస్పీ డి.జానకి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రావు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు!

image

@మహబూబ్ నగర్ జిల్లాల్లో కొనసాగుతున్న ఎండల తీవ్రత
@మహమ్మదాబాద్ లో బీజేపీ శిక్షణ తరగతులు ప్రారంభం
@ఓబీసీలకు అన్యాయం జరుగుతుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
@దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
@భూత్పూర్: 44వ జాతీయ రహదారిపై దారి బోల్తా- డ్రైవర్ కు గాయాలు
@అడవి పంది దాడిలో గాయపడ్డ రైతు మృతి
@రాజాపూర్ మండల కేంద్రంలో.. చలివేంద్రంను ప్రారంభించిన సర్పంచ్