India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 20 నుంచి మే 26వ తేదీ వరకు జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. బుధవారం పరీక్షల కోసం సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. పది పరీక్షలకు 459 మంది, ఇంటర్‌కు 876 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
మెదక్ జిల్లాలో భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. గురువారం మనోహారాబాద్, తుప్రాన్, 18న అల్లాదుర్గ్,రామాయంపేట, 19న శివంపేట,నర్సాపూర్, 20న కూల్చారాం, కౌడిపల్లి, 21న చిలిపిచేడ్, పాపన్నపేట,టేక్మాల్, 22న పెద్దశంకరంపేట్, రేగోడ్, 23న మసాయిపేట్, చేగుంట, చిన్నశంకరంపేట్, 24న ఎల్డుర్తి, నిజాంపేట్, 25న నార్సింగి, మెదక్, హవేళి ఘనపూర్ మండలాలున్నాయి.
టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.
తండ్రిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన వడ్ల దశరథ్(60)పై ఆయన పెద్ద కుమారుడు నాగరాజు ఈనెల 12న ఆస్తి పంపకాలు చేయడం లేదని కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నాగరాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.
మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే యుడైస్ సర్వేలో పరిశీలించిన అంశాలను పక్కగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల మౌలిక వసతుల వివరాలను పరిశీలించి, ఏమైనా తప్పులు ఉంటే యుడైస్ వెబ్ సైట్లో సరిదిద్దుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు.
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.
వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.
Sorry, no posts matched your criteria.