India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఓటర్ల జాబితా సవరణలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా మ్యాపింగ్ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మెదక్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారులోని హనుమాన్ బండల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పోతంశెట్టిపల్లికి చెందిన బట్ట కిష్టయ్య, ఎండీ యూసఫ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరేకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరచాలని డీసీహెచ్ఎస్ డా. శివ్ దయాల్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట, కౌడిపల్లి ఆసుపత్రుల వైద్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓపీ, ఐపీ సేవలు, ప్రసవాలు, డయాలసిస్ విభాగాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం జరిగిన ద్వితీయ భాషా పరీక్షకు 99.83 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ విజయ తెలిపారు. మొత్తం 11,239 మంది విద్యార్థులకు గాను 11,221 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలుగు నూతన సంవత్సరం ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి పథంలో పయనించాలని ఆమె అభిలషించారు.

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బుధవారం ఢిల్లీలోని ESIC ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్మిక సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

నిజాంపేట మండలం తిప్పన్నగుల్లలో కాకతీయ శైలికి చెందిన పురాతన శివాలయాన్ని ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయంలో శివలింగం లేకపోయినా, లతలు, సింహాలు, హంసల చెక్కడాలతో కూడిన మూడు గర్భద్వారాలు అద్భుతంగా ఉన్నాయి. శైవ ద్వారపాలకుల శిల్పాలు ఈ ఆలయ విశిష్టతను చాటుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.