India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదిహేడు రోజులు పూజలందుకున్న గణపతి లడ్డూను వేలం పాటలో ఓ ముస్లి యువకుడు దక్కించుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మార్కెట్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను నిమజ్జనం సందర్భంగా సోమవారం వేలం వేశారు. లడ్డూను దక్కించుకునేందుకు హోరా హోరీగా పోటీ సాగగా.. చివరకు మక్బూల్ అనే యువకుడు రూ.36,616 వేలకు సొంతం చేసుకున్నాడు. మరో లడ్డూను రూ.7వేలకు పోల జనార్ధన్ దక్కించుకున్నాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. జిల్లాలో ఎక్కడో ఒకచోట అత్యాచారాలు, లైంగిక వేధింపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు అధికారలు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్షణకు టోల్‌ఫ్రీ నంబర్లను, యాప్‌లను తీసుకొచ్చారు. చైల్డ్ హెల్పులైన్-1098, షీ టీం-8712657963, భరోసా-08457293098, మహిళా హెల్ప్‌లైన్-181, మిషన్ పరివర్తన-14446, పోక్సో ఈ బాక్స్, 112 యాప్‌లు ఉన్నాయి. SHARE IT
ఈనెల 28న మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి లక్ష్మీ శారద పేర్కొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ రోజున మెదక్, నర్సాపూర్ కోర్టు నందు నిర్వహించబడును అని ఈ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులను పరిష్కరించుకునే విధంగా న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ సదావకాశాన్ని ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ నెల 28న జిల్లా కోర్టులో నిర్వహించనున్నారని, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు ఉన్నవారు సామరస్య ధోరణితో రాజీ పడదగిన ఆయా కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టును సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.
శివంపేట మండలం గోమారంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. నిన్న రాత్రి గోమారంలో ఆమె ఇంటిపై జరిగిన దాడి వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాడులతో MLA సునీత మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు అన్న కేటీఆర్ ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నారాయణఖేడ్‌లో అధిక ధరలకు టాబ్లెట్లు అమ్ముతున్న మెడికల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు అధిక ధరలకు మెడికల్ యజమానులు మందులు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాలు సమర్పించి గంగిరేగు చెట్లు వద్ద పట్నాలు వేశారు.
రైతు సమస్యలపై పోరాటానికి నంగునూరు వేదికగా మారనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27న నంగునూరులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సన్నాహక ఏర్పాట్లలో భాగంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.