India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్ష దరఖాస్తుల గడువు ఈ మంగళవారంతో ముగియనుందని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని పేర్కొన్నారు. స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనుందని తెలిపారు. పూర్తి వివరాలకు bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
చేగుంట మండల పరిధిలోని చందాయపెట్ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కే. స్వాతి రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 14 పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ శంకర్ చారి తెలిపారు. స్వాతి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు శ్రీ కిషన్, ఉపాధ్యాయుల బృందం హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల, విద్యార్థులు ఆమెను సత్కరించారు.
మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.
మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.
ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.
ఇంట్లో వాడి వదిలేసిన ఫోన్లను మొబైల్ షాపులకు లేదా తెలియని వ్యక్తులకు అమ్మడం ప్రమాదకరమని MDK అధికారులు సూచిస్తున్నారు. నేరగాళ్లు ఆ ఫోన్లలోని IMEI నంబర్లు, మదర్ బోర్డులు, సాఫ్ట్వేర్ సేకరించి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారని, ఈ పరికరాల ద్వారా బ్యాంక్ మోసాలు, డేటా చోరీలు, ఆన్లైన్ నేరాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. పాత మొబైల్ అమ్మే ముందు డేటాను పూర్తిగా డిలీట్ చేసి, ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నారు.
పీఆర్టీయూ మెదక్ జిల్లా నూతన అధ్యక్షుడిగా మేడి సతీశ్‌రావు ఎన్నికయ్యారు. జిల్లా సర్వసభ్య సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. సతీశ్‌రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని, అదే విధంగా సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
MDK జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.
ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు, ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా ఈనెల 12న మెదక్ వినాయక ఫంక్షన్ హాల్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో స్టేట్ అబ్జర్వర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్ పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.