India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వడ్ల దశరథంపై సొంత కుమారుడు వడ్ల నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ దశరథ్‌ను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దశరథం పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భూమి పంచి ఇవ్వడం లేదంటూ తండ్రిపై నాగరాజు దాడి చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న పాపన్నపేట, మెదక్‌లో అత్యధికంగా 40.9 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణం శాఖ అధికారులు వెల్లడించారు. హవేలిఘనపూర్ 40.8, టేక్మాల్ 40.6, వెల్దుర్తి 40.1, కుల్చారం 39.9, నిజాంపేట్, చేగుంట 39.7, కౌడిపల్లి 39.6, రామయంపేట్ 39.4, నర్సాపూర్ 39.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలో తీవ్రత దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటుని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారాని, పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం Xలో పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.
వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ కార్యక్రమాలైన ఎయిడ్స్, ఫైలేరియా, కుష్టు వ్యాధి, మలేరియా తదితర రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణ, సమాన హక్కులకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన చేసిన కృషిని కొనియాడారు. సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.
ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.