Medak

News August 9, 2024

సంగారెడ్డి: రేపటి వరకు ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు

image

ఇంటింటా ఇన్నోవేషన్ గడువును ఈనెల 10 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. దరఖాస్తులను 9100678543 నంబర్‌కు పంపించాలని చెప్పారు. ఎంపికైన వాటిని ఈనెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News August 9, 2024

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలి

image

ఓపెన్ స్కూల్ ద్వారా పది, ఇంటర్మీడియట్‌ను చదువుకునే అవకాశం కల్పించినట్లు డిఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో అడ్మిషన్ల పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10 వరకు అధ్యయన కేంద్రాల్లో అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. తమ్ముడు అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకట స్వామి పాల్గొన్నారు.

News August 9, 2024

సంగారెడ్డి: రుణమాఫీపై కంప్లైంట్స్

image

రాష్ట్ర ప్రభుత్వం రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కాని రైతులంతా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. 2 విడతల్లో రుణమాఫీ కాని వారంతా గ్రీవెన్స్‌సెల్‌ బాట పట్టారు. అధికారిక లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 2,479 మంది, మెదక్‌ జిల్లాలో 2,519 మంది, సంగారెడ్డి జిల్లాలో 2,838 మంది రైతులు ఫిర్యాదు చేశారు.

News August 9, 2024

HMDAలోకి మన ఉమ్మడి మెదక్

image

HMDAలో కొత్తగా 2 <<13811034>>జోన్లు<<>> పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలు కలిశాయి. మేడ్చల్-1 జోన్‌లో నర్సాపూర్, శివంపేట, తూప్రాన్, మనోహరాబాద్, మేడ్చల్-2లో ములుగు, వర్గల్, శంకర్‌ప్లలి-1లో రామచంద్రాపురం, శంకర్‌ప్లలి-2లో అమీన్‌పూర్, పటాన్‌చెరు, సంగారెడ్డి, కంది, జిన్నారం, గుమ్మడిదల, హత్నూర ఉన్నాయి. త్వరలో RRR మొత్తం HMDA పరిధిలోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

News August 9, 2024

మెదక్: RRRపై 6చోట్ల ఇంటర్ చేంజ్‌లు !

image

ఉమ్మడి జిల్లాలో చేపట్టిన RRRపై 6చోట్ల ఇంటర్ చేంజ్‌(సర్కిల్స్)ల నిర్మాణం చేపట్టాలని NHAI నిర్ణయించింది. ఈ నిర్మాణం జగదేవ్పూర్ నుంచి సంగారెడ్డి వరకు సుమారు 110KM పొడవు ఉండగా దీనిపై 6 చోట్ల ఇంటర్ చేంజ్‌లు చేపట్టనున్నారు. ఓఆర్అర్ కంటే మెరుగ్గా ఈ నిర్మాణం జరగనుంది. ఈ ప్రదేశాల్లో ఎక్కే, దిగే వెహికల్స్‌కు అనకూలంగా డిజైన్ ఉంటుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో జరగబోతుందని అధికారులు తెలిపారు.

News August 9, 2024

మెదక్ జిల్లాకు నేడు మంత్రి కొండ సురేఖ రాక

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి ఈరోజు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ విచ్చేస్తున్నట్లు జెడ్పి సీఈవో సిహెచ్ ఎల్లయ్య తెలిపారు. తూప్రాన్ ఎంపీడీవో శేషాద్రి తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. ఇస్లాంపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం చివరి రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని వివరించారు.

News August 9, 2024

సంగారెడ్డిలో న్యాయవాదుల రాస్తారోకో

image

జనగమలో న్యాయవాదులపై దాడిని నిరసిస్తూ సంగారెడ్డిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదుల పై దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా న్యాయవాదులు రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు అంబరీష్, ఆంజనేయులు, విజయ్ కుమార్, లలిత, న్యాయవాదులు పాల్గొన్నారు.

News August 8, 2024

వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడాని ఆరోపణలు: మంత్రి పొన్నం

image

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల కోసం అధికారికంగా స్వయంగా అమెరికాకు వెళ్తే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు బాగుపడడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

News August 8, 2024

పౌరుషాల జిల్లా.. మన మెదక్ ‘ఖిల్లా’

image

రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా నాటి ఆనవాళ్లు మాత్రం ఇంకా మన రాష్ట్రంలో దర్శనం ఇస్తూనే ఉన్నాయి. నేటికీ నిలిచిన పురాతన కట్టడాలు, కోట గోడలు, బురుజులు మెదక్ జిల్లా రాచరిక పాలనకు, పౌరుషానికి దర్పణం. నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా చెప్పుకునే మెదక్ ‘ఖిల్లా’ పట్టణానికి ఓ మణిహారంగా నిలిచింది. రెండో ప్రతాపరుద్రుడు తన రాజ్య రక్షణ కోసం నిర్మించిన కోట ఇది. ఈ కోటకు మీరు వెళ్లారా.. వెళ్తే మీ అనుభవాలను పంచుకోండి.

News August 8, 2024

హరీశ్ రావును కలిసిన MBBS, BDS విద్యార్థుల పేరెంట్స్

image

MBBS, BDS ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. ప్రభుత్వ అనాలోచితంగా తెచ్చిన జీవో వల్ల తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నిబంధనతో తెలంగాణలో పుట్టిన పిల్లలు తెలంగాణలో నాన్ లోకల్ కావడం బాధగా ఉందన్నారు.