Medak

News February 26, 2025

మెదక్ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ కన్నుమూత

image

మెదక్ సీఎస్ఐ చర్చ్ రిటైర్డ్ గురువు రాబిన్ సన్ మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం కన్నుమూశారు. మెదక్ పట్టణంలోని దాయర వీధికి చెందిన రాబిన్సన్ మెదక్ సీఎస్ఐ చర్చిలో 2010 నుంచి 2019 వరకు ప్రిసిబిటరి ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. మెదక్ అధ్యక్ష మండలంలో వైస్ ఛైర్మన్‌గా, మినిస్ట్రియల్ కన్వీనర్‌గా తదితర పదవుల్లో పనిచేశారు.

News February 26, 2025

ఏడుపాయల బందోబస్తు పర్యవేక్షించిన ఎస్పీ

image

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఏడుపాయల వనదుర్గమాత వద్ద భారీ ఎత్తున జాతర ఉత్సవాల నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూప్రాన్ డిఎస్పీ వెంకటరెడ్డి, మెదక్ డిఎస్పీ, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి బందోబస్తు పర్యవేక్షించారు.

News February 26, 2025

MLC ఎన్నికలకు 174 మందితో బందోబస్త్: ఎస్పీ

image

రేపు జరుగనున్న MLC ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో మొత్తం పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 8 రూట్లలో ఆయుధ పహారాలో పోలింగ్ సామాగ్రిని తరలించడం జరుగుతుందన్నారు. స్ట్రైకింగ్ ఫోర్స్, QRTలు, డీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు.

News February 26, 2025

పాపన్నపేట: యువకుడి మృతదేహం లభ్యం

image

ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదన్నారు. మృతుడి వయసు సుమారు 30 ఏళ్లు ఉండి ఒంటిపై పచ్చని టీ షర్ట్, నల్లని షర్ట్, నిక్కరు ఉందని, ఆచూకీ తెలిస్తే స్టోషన్‌లో సంప్రదించాలన్నారు.

News February 26, 2025

మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ఠ భద్రత: SP

image

మెదక్ జిల్లాలో ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు.

News February 26, 2025

మెదక్: మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

image

మెదక్ జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల గడువు మార్చి 10 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. https: //telanganams.cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News February 26, 2025

మెదక్: MLC ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

image

శాసనమండలి ఎన్నికల కోసం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 27న జరిగే ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇద్దరు డీఎస్పీలు, 7 ఎస్ఐలు, 41మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, 106 మంది పోలీస్ కానిస్టేబుల్స్, 18 మంది హోం గార్డులు, మొత్తం 174 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News February 26, 2025

మెదక్ జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 14,224 మంది

image

మెదక్ జిల్లాలో 14,224 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షల ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

News February 26, 2025

మెదక్: టెన్త్, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

image

మెదక్: త్వరలో జరగనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రత, సిబ్బంది గురించి సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

News February 25, 2025

సిద్దిపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

image

సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ యాదాద్రి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరూకొలు గ్రామానికి చెందిన అనూష(26) భువనగిరిలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ భువనగిరిలో నివాసం ఉంటున్నారు. తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!