Medak

News February 28, 2026

మెదక్: ఇన్‌ఛార్జ్ మంత్రిని కలిసిన కలెక్టర్!

image

మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలెక్టర్ ప్రతిమా సింగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు రోజుల క్రితమే కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె, మంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. ప్రభుత్వంపై నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలెక్టర్ తెలిపారు.

News February 28, 2026

మెదక్: రాష్ట్ర స్థాయి ‘MUN’ పోటీలకు 11 మంది ఎంపిక!

image

మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) పోటీల్లో ప్రతిభ చాటిన 11 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. 56 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలకు ఎంఈవో శంకర్, హెచ్‌ఎంలు శ్రీనివాస్ రెడ్డి తదితరులు జడ్జిలుగా వ్యవహరించారు. విజేతలను డీఈవో విజయ, ఏఎంవో సుదర్శన్ మూర్తి అభినందించారు.

News February 28, 2026

మనోహరాబాద్: లింగారెడ్డిపేటలో చిరుత కలకలం!

image

లింగారెడ్డిపేట గ్రామ శివారులో చిరుత దాడిలో రెండు దూడలు మృత్యువాత పడ్డాయి. రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్యకు చెందిన పశువులపై చిరుత దాడి చేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, పాదముద్రల ఆధారంగా ఆనవాళ్లను సేకరించారు.

News February 28, 2026

MDK: శాంతి భద్రతల భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1 నుంచి 31 వరకు పోలీసు యాక్ట్ 1861 సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటాయని జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిషేధమన్నారు. చట్టవ్యతిరేక చర్యలు, ఆస్తి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News February 28, 2026

మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

image

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.

News February 28, 2026

మెదక్‌లో సినిమా షూటింగ్ సందడి

image

చిన్నశంకరంపేట మం.జంగరాయి పరిసరాల్లో శివాని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘బుల్లెట్ బండి’ సాంగ్ షూటింగ్ సందడిగా జరిగింది. డైరెక్టర్ అరవింద్ దర్శకత్వంలో హీరో సంతోష్, నటులు అలీ గడ్డం, మహిపాల్, సుమిత్ర, అంజిరెడ్డి పాల్గొన్నారు. నిర్మాత శివాని ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ చిత్రానికి మను కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రకృతి దృశ్యాల మధ్య జరుగుతున్న ఈ చిత్రీకరణను గ్రామస్థులు ఆసక్తిగా వీక్షించారు.

News February 28, 2026

MDK: హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి: అదనపు ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ గౌరవ వందనం స్వీకరించి సిబ్బందికి క్రమశిక్షణ, ఫిట్‌నెస్ ప్రాముఖ్యత వివరించారు. “Arrive Alive – 2026”లో భాగంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని, అతివేగమే ప్రమాదాలకు కారణమని చెప్పారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో సేవలందించిన సిబ్బందిని అభినందించి, యువతలో రోడ్డు భద్రత అవగాహన పెంచాలని సూచించారు.

News February 28, 2026

మెదక్: ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్‌గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్టర్ గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది. 2016లో ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలు (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట)గా విభజించిన విషయం తెలిసిందే.

News February 28, 2026

మెదక్: 9 నెలలు.. రూ.4,611 కోట్ల రుణాలు

image

మెదక్ జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు. బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్న రుణ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News February 28, 2026

మెదక్: మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఘనంగా వీడ్కోలు

image

రెండేళ్ల పాటు మెదక్ కలెక్టర్‌గా పనిచేసి సహకార శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయిన రాహుల్ రాజ్‌కు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులు, విప్లవాత్మక నిర్ణయాలతో మెదక్ జిల్లాను రాహుల్ రాజ్ రోల్ మోడల్‌గా నిలిపారని కొనియాడారు. పాలనలో ఆయన తనదైన ముద్ర వేశారని అధికారులు గుర్తు చేసుకున్నారు.