Medak

News September 2, 2024

పటాన్‌చెరు: దంపతుల మధ్య గొడవ.. భార్య సూసైడ్

image

వాషింగ్‌ మెషీన్‌ బాగు చేయించలేదన్న కోపంతో భార్య సూసైడ్ చేసుకున్న ఘటన రామచంద్రాపురంలో జరిగింది. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన సంగీత ప్రియ(30) భర్త రాజ్‌కుమార్‌తో కలిసి BHEL సైబర్‌ కాలనీలో ఉంటుంది. వాషింగ్‌ మెషీన్‌కు రిపేర్ చేయించలేదని, ఇంట్లోకి సరకులు లేవని శనివారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. భర్తపై కోపంతో బెడ్ రూంలోకి వెళ్లిన సుప్రియ డోర్ తీయకపోవడంతో పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొంది.

News September 2, 2024

రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక విద్యార్థి

image

ఇంటర్‌ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్‌ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్‌గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్‌ నిలిచాడు. ఒకేషన్‌ కోర్సులో సుకుమార్‌ ఈటీ (ఎలక్ట్రీషియన్‌ టెక్నీషియన్‌) చేశాడు. ఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 994 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయి టాపర్‌గా నిలిచాడు. ఈనెల 4న హైదరాబాద్‌లో ఇంటర్‌ బోర్డు రాష్ట్ర స్థాయి టాపర్లకు నగదు పారితోషికం, అవార్డు అందజేయనున్నారు.

News September 2, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా మెదక్, సంగారెడ్డి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, జాగ్రత్తగా ఉండాలని మంత్రులు, అధికారులు హెచ్చరించారు. రేపు కూడా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

News September 2, 2024

కొప్పోల్ ఉమా సంగమేశ్వర ఆలయంలో కాశిబుగ్గ.. పూజలు

image

పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోల్ శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయ గర్భగుడిలో కాశిబుగ్గ(నీరు) రావడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమా సంగమేశ్వర స్వామి గర్భాలయంలోకి ప్రత్యేకంగా నీరు రావడాన్ని భక్తులు కాశిబుగ్గగా పేర్కొంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పదేళ్ల తర్వాత తాజాగా ఆదివారం కాశిబుగ్గ రావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు.

News September 1, 2024

పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలి: జిల్లా వ్యవసాయ అధికారి

image

గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా వ్యవసాయ అధికారి టి.రాధిక సూచించారు. పంటల రక్షణ కోసం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె తెలిపారు. ముందుగా పంట పొలాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు తరలించాలని. అనంతరం యాజమాన్య పద్ధతులను పాటించాలని ఆమె రైతులకు సూచించారు. వర్షాలు తగ్గిన అనంతరం పంటలకు మందులు పిచికారి చేయాలని సూచించారు.

News September 1, 2024

సిద్దిపేట: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పోన్నం

image

భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ సూచించారు. నిన్నటి నుంచి జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ తదితర అన్ని శాఖల అధికారులతో ఆదివారం ఫోన్ ద్వారా అప్రమత్తం చేశారు.

News September 1, 2024

సంగారెడ్డి: రుద్రారంలో విషాదం

image

పటాన్ చెరు మండలం రుద్రారంలో విషాదం చోటుచేసుకుంది. రుద్రారంలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తర్వాత తల్లి ఉరి వేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పటాన్ చెరు పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు పరిశీలిస్తున్నారు.

News September 1, 2024

సెల్ఫీల కోసం వాగుల వద్దకు వెళ్లొద్దు: ఎస్పీ ఉదయ్

image

యువకులు సెల్ఫీల కోసం వరద ప్రవాహాల వద్దకు వెళ్లే లాంటి ప్రయోగాలు చేయకూడదని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారుల వంతెనలపై నీరు ప్రవహిస్తుండడంతో అటువైపుగా ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. సమస్యలు ఉంటే వెంటనే 8712657888కి సమాచారం ఇవ్వాలన్నారు.

News September 1, 2024

సిద్దిపేట: ‘ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి’

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల్లో ఉండాలని పార్టీ నేతలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా చెక్ డ్యామ్ ‌లు, చెరువు‌లు నిండాయా, చెరువు తూంలు దుంకుతున్నాయా అని పార్టీ నేతలతో మాట్లాడి ఆరా తీశారు.

News September 1, 2024

మెదక్: బాబోయ్ కుక్కలు.. హడలెత్తిస్తున్నాయి..!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుండి మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు కుక్కలు అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలు చాలా గ్రామాల్లో ప్రజలను ప్రమాదాలకు గురి చేస్తున్నా యి. ఈ మధ్యకాలంలోనే దుబ్బాకలో పూరి గుడిసెలో ఉన్న ముసలమ్మపై దాడి చేసిన సంఘటన తెలిసిందే. దాదాపు కుక్కల గుంపులో 50 నుండి 100 వరకు కుక్కలు ఉండి గ్రామాల్లో ఇష్టానుసారంగా సంచరిస్తున్నాయి. వీటిపై దృష్టిపెట్టాలని అంటున్నారు.