Medak

News August 1, 2024

సంగారెడ్డి: నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

image

జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News July 31, 2024

సంగారెడ్డి: నకిలీ బంగారం బిస్కెట్లతో మోసం.. పోలీసులకు ఫిర్యాదు

image

అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ బంగారం బిస్కెట్లు కలకలం రేపాయి. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.. రమణమ్మ అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం నాలుగు లక్షలు అప్పు కావాలని రాజరాజేశ్వరి అనే మహిళ వద్దకు వచ్చింది. షూరిటీగా నాలుగు బంగారం బిస్కెట్లు పెట్టి వెళ్లింది. అనుమానం వచ్చిన బాధితురాలు రాజరాజేశ్వరి తనిఖీ చేయగా అవి నకిలీవి అని తేలింది. దీంతో మోసపోయానని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 31, 2024

మెదక్: గ్రామాల్లో ఎన్నికల సందడి !

image

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అప్పుడే ఊపందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొంది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుండే ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

News July 31, 2024

సంగారెడ్డి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సూసైడ్

image

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో విషాదం చోటుచేసుకుంది. ముత్తంగి శివారులో చెట్టుకు ఉరేసుకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విక్రమ్(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగంలో అనుకున్న స్థాయికి ఎదగలేదనే మనస్తాపంలో విక్రమ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి, స్నేహితులు తెలిపారు. ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 31, 2024

మెదక్: గ్రామాల్లో ఎన్నికల సందడి !

image

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానేలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేదు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అప్పుడే ఊపందుకుంది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొంది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి నుండే ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. ఏకగ్రీవం కోసం ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

News July 31, 2024

కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ ఛైర్మన్‌గా బాలిశెట్టి సంజయ్

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట గ్రామానికి చెందిన బాలిశెట్టి సంజయ్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. బుధవారం ఆయనను లీగల్ కమిటీ వైస్ ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ కమిటీ ఛైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, మక్కరాజుపేట గ్రామస్థులు సంజయ్ ను అభినందించారు.

News July 31, 2024

మెదక్: రెండవ విడత రుణమాఫీపై గందరగోళం!

image

రెండవ విడత పంట రుణమాఫీ గందరగోళంగా ఉందని రైతులు వాపోతున్నారు. సిద్దిపేట జిల్లాలో 79,721 మంది రైతులకు రూ. 558.61 కోట్లు, మెదక్‌‌లో 74,342 మంది రైతులకు రూ. 473.78 కోట్లు, సంగారెడ్డిలో 77,951 మంది రైతులకు రూ.563.99 కోట్లు మాఫీ అయింది. ఉమ్మడి జిల్లాలో రెండు విడతలు కలిపి 2,32,014 మంది రైతులకు రూ.1,596.38 కోట్ల రుణమాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా చాలా మంది రైతులకు మాఫీ జరగలేదని రైతన్నలు వాపోతున్నారు.

News July 31, 2024

MDK: గంజాయి మత్తుకు యువత బానిస!

image

విద్యాబుద్ధులు నేర్చుకొని, ఉద్యోగాలు సాధించాల్సిన యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవితను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మాఫియా యువతను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేసుకున్నారు. 7 నెలల్లో సంగారెడ్డి జిల్లాలో 63 కేసులు నమోదు కాగా 56 మంది అరెస్టయ్యారు. ఇక సిద్దిపేటలో 24 కేసులు నమోదు కాగా 75, మెదక్‌లో 16 కేసులు నమోదు కాగా 83 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

News July 31, 2024

సంగారెడ్డి జిల్లాలో 331 మందిపై హిస్టరీ షీట్స్ ఓపెన్

image

సంగారెడ్డి జిల్లాలో నేరాలకు అలవాటు పడిన 331 మంది నేరస్థులపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేసినట్లు ఎస్పీ రూపేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సత్ ప్రవర్తన కలిగిన రౌడీలు, కేడీలు, సస్పెక్ట్‌ల హిస్టరీ షీట్స్ క్లోజ్ చేస్తున్నట్లు వివరించారు. సత్ప్రవర్తన కలిగిన వారితో ఫ్రెండ్లీగా ఉంటామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

News July 31, 2024

WOW.. తెలంగాణ టీం కెప్టెన్‌గా సిద్దిపేట బిడ్డ

image

అండర్-17 జూనియర్ నేషనల్ ఫుట్‌బాల్ తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చిన్నకోడూరు జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థిని వడ్లకొండ చైతన్య శ్రీ ఎంపికైనట్లు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే పోటీల్లో తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చైతన్యశ్రీ ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ భూపాల్ రాజు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.