India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు శిక్షణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.
సైబర్ బాధితులకు న్యాయం జరిగేందుకు బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎస్పీ రూపేష్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకు సమాచారం ఇవ్వవద్దని చెప్పారు. సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసు అధికారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.
HYDలోని వినాయక మండపాల నిర్వాహకులకు పోలీసులు కీలక సూచన చేశారు.
➤పర్మిషన్ కోసం ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
➤మీ సేవలో చలాన్ కట్టాలి. (రూ. 145+100)
➤ఐదుగురు ఆర్గనైజర్ల ‘ఆధార్’ అవసరం.
➤మండపం చుట్టుపక్కల ఓనర్ల నుంచి NOC జతచేసి సంబంధిత PSలో సమర్పిస్తే అనుమతి పొందవచ్చు.
➤పర్మిషన్ తీసుకుంటే కరెంట్ FREE అని CM రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అక్రమంగా కనెక్షన్ తీసుకుంటే చర్యలు తప్పవన్నారు.
SHARE IT
జిల్లాలో ఎయిడ్స్ కేసులు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని ఆ శాఖ జిల్లా అధికారి డేనియల్ అన్నారు. సంగారెడ్డిని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసులు ఎక్కువగా 18 నుంచి 28 సంవత్సరంలోపు వారే ఉన్నారని చెప్పారు. యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లాలోని వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు నమూనాలను ప్రదర్శించారు.
క్రీడలు శారీరక, మానసిక దృఢత్వానికి ఎంతో తోడ్పాటు అందిస్తాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మెదక్ స్టేడియంలో జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉద్యోగులకు చేపట్టిన వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లాలో క్రీడలు అభివృద్ధి చేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు
బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. సంక్షేమ శాఖ కమిషనర్ కరుణతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో లబ్ధిదారులకు గ్యారెంటీ సరుకులను మాత్రమే సరఫరా చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, సిడిపివోలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చెరువుల, నాలాల ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.
పటాన్‌చెరు మండలం పాశం మైలారం పరిధిలోని మెడికేర్ పరిశ్రమలో జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3.75 కోట్ల విలువైన ఆల్ఫాజోలం, గంజాయిని గురువారం దహనం చేశారు. ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణను పాటిస్తూ దహనం చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు రవీందర్ రెడ్డి సత్తయ్య పాల్గొన్నారు.
హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ ఫీవర్, డెంగ్యూ నియంత్రణపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
CM రేవంత్‌రెడ్డి గురుకులాల్లో మౌలిక వసతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. మీ పాలన ఎలా ఉందొ చెప్పడానికి గురుకులాలే నిదర్శనం. KCR హయాంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయి’అని X వేదికగా ఫైర్ అయ్యారు. విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.