Medak

News April 12, 2025

MDK: రాజీవ్‌ యువ వికాసం.. ఈనెల 14 వరకే ఛాన్స్

image

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ యువ వికాసం పథకం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు మెదక్ జిల్లాలో 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 14 వరకు ఛాన్స్ ఉన్నందున ఈ అవకశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు సూచించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.

News April 12, 2025

MDK: వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: డాక్టర్ శ్రీరామ్

image

వైద్య సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సూచించారు. ఆయన శుక్రవారం పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి జాతీయ కార్యక్రమాలైన ఎయిడ్స్, ఫైలేరియా, కుష్టు వ్యాధి, మలేరియా తదితర రోగాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

News April 11, 2025

సమాన హక్కులకు కృషి చేసిన మహనీయుడు ఫూలే: మెదక్ ఎస్పీ

image

కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణ, సమాన హక్కులకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన చేసిన కృషిని కొనియాడారు. సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

News April 11, 2025

సదాశివపేట రిజిస్ట్రేషన్ ఆఫీసులో స్లాట్ బుకింగ్

image

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానానికి సదాశివపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎంపికైంది. ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లిన 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఈ విధానం కింద రాష్ట్రంలో 22 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సదాశివపేట మాత్రమే ఎంపికైందని జిల్లా రిజిస్ట్రార్ సుబ్బలక్ష్మి తెలిపారు.

News April 11, 2025

మెదక్: ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల

image

ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లను ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసిందని మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.telanganaopenschool.org వెబ్సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

మెదక్: చికిత్స పొందుతూ రైతు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. రంగంపేట గ్రామానికి చెందిన ఎల్లయ్య (50) అనే రైతు బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలానికి వెళ్లి వస్తుండగా అతివేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 10, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి జర్నలిస్ట్ శ్రీధర్‌కు ఉగాది పురస్కారం

image

తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.

News April 10, 2025

మెదక్: కొడుకు పెళ్లి.. అంతలోనే విషాదం

image

మెదక్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. కుమారుడి పెళ్లి అయిన గంట వ్యవధిలో తల్లి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో జరిగింది. గ్రామంలో మల్కాని నరసమ్మ(48) కొడుకు రవీందర్ పెళ్లి బుధవారం జరిగింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. పెళ్లైన గంట వ్యవధిలో చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకవైపు శుభకార్యం.. మరొకవైపు చావు కబురు ఆ కుటుంబాన్ని కలచివేసింది.

News April 10, 2025

భారీ వర్ష సూచన.. మెదక్ జిల్లాలో మోస్తారు వర్షాలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించింది. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, మెదక్‌లో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడనుండటంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News April 10, 2025

బెట్టింగుకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ జిల్లాలో ఎవరైనా క్రికెట్ మరే ఇతర బెట్టింగ్లకు పాల్పడిన ప్రోత్సహించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారం అందితే డైల్ 100 లేదా 8712657888 నంబర్‌కు సంప్రదించాలన్నారు.