India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ మున్సిపాలిటీ గాంధీనగర్ 18వ వార్డులో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులు కలెక్టర్‌కు పోలింగ్ స్లిప్ అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటర్ స్లిప్‌ల పంపిణీ కొనసాగుతోందన్నారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించారు.

తూప్రాన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు మంద మకరంద్ సందర్శించారు. ఓటర్లకు కల్పిస్తున్న ప్రాథమిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యం, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలు సాఫీగా జరగాలన్నారు. ఏవైనా ఎన్నికల నిర్వహణ పనులు పూర్తి కాకపోతే రేపు ఉదయం 9 గంటల వరకు పూర్తి చేయాలన్నారు.

మెదక్ జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.

ఈ నెల 11న జరగనున్న మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపులు, ఫ్యాక్టరీల ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు కల్పించాలని ఆదేశించారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపాలిటీలకు ఈ నెల 11న ఉ.7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నిశ్శబ్ద కాలం (Silent Period) అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం, అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేయించాడని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేశాడన్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్‌లో జరిగిన ప్రమాదం అని అన్నారు. మెదక్‌లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మెదక్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భాగంగా రూ.2,69,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. 40 కేసుల్లో సుమారు రూ.5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు చెప్పారు. రూ.3,36,000 విలువైన 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Sorry, no posts matched your criteria.