India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లా శివంపేట మండలం బిజిలి పూర్‌లోని హనుమాన్ దేవాలయంలో నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయంలోని శివలింగం వద్ద సుమారు గంట పాటు పడగ విప్పి నాగుపాము దర్శనం ఇవ్వడంతో గ్రామస్థులు సాక్షాత్తు శివుడు దర్శనమిచ్చాడని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంటపాటు శివుడి వద్ద పడగవిప్పి ఉండడంతో యువకులు నాగుపాము ఫోటోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.

శామీర్‌పేట్‌లోని జీనోమ్ వ్యాలీ PS పరిధిలో లాల్‌గడి మలక్‌పేట్ హైవేపై సఫారీ కారు, డీసీఎం ఢీ కొన్నాయి. సఫారీ వాహనం సిద్దిపేట నుంచి నగరానికి వస్తుండగా డివైడర్‌కు తగిలి ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులు సిద్దిపేట జిల్లా వర్గల్‌కు చెందిన రాజు, తుర్కపల్లి పరిధి మురహరిపల్లికి చెందిన శ్రవణ్‌గా పోలీసులు గుర్తించారు.

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని ధనశ్రీ గ్రామంలో అబ్బాస్ (25)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అబ్బాస్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితులతో విందుకు వెళ్లి గ్రామ శివారులో దాడికి గురయ్యాడు. దాడిలో అబ్బాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్‌ఐ రాజేందర్ రెడ్డి విచారణ చేపట్టారు.

ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. వారిని విచారణ చేయగా రామాయంపేట నస్కల్‌కు చెందిన ఎధీజాజ్, సికింద్రాబాద్‌కు చెందిన హిదాయత్ అలీ, బాలాజీ నగర్‌కు చెందిన మద్దూరు లాలును అరెస్ట్ చేసి వారి నుంచి 30 బుల్లెట్లు, రివాల్వర్, సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

రామచంద్రపురం మండలంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో నేటి నుంచి నిర్వహించే టెన్త్ క్లాస్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 1,222 మంది ఉపాధ్యాయులు మూల్యాంకనంలో పాల్గొంటారన్నారు. టెన్త్ మూల్యాంకన కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. వాల్యూయేషన్ సెంటర్లో మౌలిక వసతులు గురించి సెంటర్ ఇన్‌ఛార్జ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లా కేంద్రంలో మొదటి సారిగా వాల్యుయేషన్ నెల రోజులుగా నడుస్తుందన్నారు. కలెక్టర్ వెంట డిఐఈఓ మాధవి ఉన్నారు.

దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని గుమ్మడిదల పోలీసులు అరెస్ట్ చేశారు. జిన్నారం సీఐ నయుముద్దీన్ వివరాలు.. మెదక్ జిల్లా శివంపేట (M) శభాష్ పల్లికి చెందిన ఫయాజ్(30) సంజీవ్(27) కలిసి గుమ్మడిదల, రామ్ రెడ్డి బావి, కానుకుంట, నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ ఊరి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని హుండీలలో చోరీకి పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాపన్నపేట పాతూరులోని పౌర సరఫరాల శాఖ గోదాంలోని నిల్వ ఉన్న బియ్యం నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ, హాస్టల్స్‌కు సరఫరా చేసే బియ్యం, రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

మెదక్ కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగదానంద కారకుడు, జగదభిరాముడి జీవితం సమాజానికి ఆదర్శమన్నారు. కోదండ రాముని ఆశీర్వాదంతో జిల్లా ప్రజలు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉండాలని కలెక్టర్ కోరుకున్నట్లు వివరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనచారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Sorry, no posts matched your criteria.