India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లారీ, బైక్ ఢీకొని మెదక్ జిలా వాసి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. డబిల్పూర్ చౌరస్తా వద్ద శనివారం బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న యాదగిరి మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు మెదక్ జిల్లా కాళ్లకల్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ రైతుల్లో చాల మంది వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని బోరు మోటారుతో కాకుండా వర్ష ఆధారంగా వేసే పంటలు వేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల రైతులు వరినాట్లు వేసి ఊపిరి పీల్చుకునే లోపే వర్షాలు పడటం లేదు. ఈసారి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు అంతంతగానే పడ్డాయి. దీంతో చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం దేవుళ్ల గుడి వద్ద పూజలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన తులం బంగారం కేవలం మాటలకే పరిమితమైందని, బంగారం మాట దేవుడెరుగు కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ. లక్ష కూడా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేత, కోతల ప్రభుత్వమని విమర్శించారు. పెన్షన్ పెంపు, రైతుబంధు, తులం బంగారం హామీలు విస్మరించారన్నారు.
వీధుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తూ పిల్లలపై దాడులు చేస్తున్నాయి. దౌల్తాబాద్ మండలంలో శనివారం ఐదుగురు చిన్నారులను గాయపరిచాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోవిందపూర్ గ్రామంలో ఆరు బయట ఆడుకుంటున్న ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమివేయడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. పిల్లలకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనలపై MLA హరీశ్‌రావు X వేదికగా స్పందించారు. ‘కుక్క కాటు కేసులు నమోదైన వెంటనే చర్యలు తీసుకుంటే గడిచిన 8 నెలల్లో 343 కుక్కకాటు ఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు. ఇప్పటికే పలుమార్లు హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రభుత్వం కుక్కల దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఢిల్లీలో పార్లమెంట్ స్పీకర్ ఓంబిర్లాను జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిపక్షం తరఫున పార్లమెంట్లో తనకు మాట్లాడేందుకు అధిక సమయాన్ని కేటాయించాలని షెట్కార్ స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు.
మెదక్ జిల్లా ఏడుపాయల దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పాత కళ్యాణకట్ట, గర్భగుడి ముందు ఉన్న 2 హుండీలను ఎత్తుకెళ్లారు. హుండీలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న నగదును తీసుకెళ్లారు. 10 రోజుల క్రితమే ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పాపన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ సైబర్ నేరగాళ్లు రూ.6.50 లక్షలు కాజేసినట్లు తూప్రాన్ SI శివానంద తెలిపారు. తూప్రాన్ మండలానికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ ‘మైఖేల్ కోర్స్ 2,185’ గ్రూపులో ఆన్లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ ఓ లింకు రాగా ఓపెన్ చేశాడు. పలు దఫాలుగా పెట్టుబడి పెట్టగా.. లాభాలు చూపించాడు. రూ.10లక్షల లాభం చూపించగా, విత్ డ్రా చేసేందుకు అవకాశం లభించలేదు.
పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనం ఇస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 జీపీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2024తో జీపీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ఆ రోజు నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కార్యదర్శులపై అదనపు భారం పడుతోంది.
కూతురి మృతి.. దంపతుల మధ్య గొడవలతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట(M) చింతమడకలో జరిగింది. SI అపూర్వరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జగదీశ్(23)కి కుమార్తె పుట్టిన కొద్ది నెలలకే చనిపోయింది. దీంతో ఆయన మద్యానికి బానిసయ్యాడు. కూతురి మృతిని తట్టుకోలేక మనస్తాపంతో గురువారం జగదీశ్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.