Medak

News February 3, 2026

మెదక్: మాజీ నక్సలైట్‌ అని బెదిరించి డబ్బులు వసూలు

image

మాజీ నక్సలైట్‌నని బెదిరిస్తూ సర్పంచ్‌ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్‌ యెన్నం రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కుర్మ శ్యామ్ కుమార్ అలియాస్ సాంబమూర్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్‌ భర్త, ఉప సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన తెలిపారు.

News February 3, 2026

మెదక్: మాజీ నక్సలైట్‌ అని బెదిరించి డబ్బులు వసూలు

image

మాజీ నక్సలైట్‌నని బెదిరిస్తూ సర్పంచ్‌ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, ఉప సర్పంచ్‌ యెన్నం రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కుర్మ శ్యామ్ కుమార్ అలియాస్ సాంబమూర్తిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సర్పంచ్‌ భర్త, ఉప సర్పంచ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన తెలిపారు.

News February 3, 2026

మెదక్: నిబంధనలకు లోబడి గుర్తులు కేటాయింపు: కలెక్టర్

image

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఫారం-7 ద్వారా ప్రకటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటన ఎన్నికల గుర్తుల కేటాయింపుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 2, 2026

మెదక్: మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలపై ఆదేశాలు

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పరోక్ష విధానంలో జరిగే మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న ప్రజాప్రతినిధులు ఒక మున్సిపాలిటీని ఎంపిక చేసుకుని ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 11 నుంచి 14 లోపు నోటీసులు జారీ చేయాలన్నారు.

News February 2, 2026

మెదక్: ప్రజావాణిలో 8 ఫిర్యాదులు

image

మెదక్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను ఎస్పీ డీవీ. శ్రీనివాస రావుకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిశీలించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ సంబంధిత సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ఇన్‌స్పెక్టర్లకు తగిన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 8 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు.

News February 2, 2026

మెదక్: విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలి: అదనపు కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రైవేటు ఇన్సూరెన్స్ వారు రూ.2.2 కోట్ల నగదు బహుమతులను ప్రకటించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. 2026లో 10వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ఫస్ట్‌కు రూ.5 లక్షలు, సెకండ్‌కు రూ.3 లక్షలు, జిల్లా టాపర్‌కు రూ.2 లక్షలు, నియోజకవర్గ టాపర్‌కు రూ.1 లక్ష, మండల స్థాయి టాపర్‌కు రూ.10 వేల చొప్పున బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు.

News February 2, 2026

వెల్దుర్తి: పెద్దనాన్న హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

image

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.25,000 జరిమానా విధించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు తెలిపారు. పెద్దనాన్న కిషన్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నానవత్ నర్సింహాపై కేసు నమోదు చేసి పూర్తి సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువడించారు.

News February 2, 2026

మున్సిపల్ ఎన్నికలు.. మెదక్‌‌లో కాంగ్రెస్ బోణీ

image

మెదక్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. 32వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గోదల మానస సాయిరాం రెండవసారి ఏకగ్రీవమైంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన గోదల జ్యోతి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మానస ఏకగ్రీవమయ్యారు. మానస 2020లో బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మానస వరుసగా రెండుసార్లు ఏకగ్రీవం కావడం విశేషం.

News February 1, 2026

MDK: మున్సిపల్ ఎన్నికలు.. ప్రజావాణి వాయిదా

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

News February 1, 2026

మెదక్ జిల్లాలో 75 వార్డుల్లో 415 మంది అభ్యర్థులు

image

మెదక్ జిల్లాలో గల 4 మున్సిపాలిటీలలో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రామాయంపేటలో 1 నామినేషన్ తిరస్కరించారు. 668 నామినేషన్లు సమర్పించారు. ఇందులో అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే.. బీఆర్ఎస్ 124, కాంగ్రెస్ 127, బీజేపీ 88, స్వతంత్రులు 52, బీఎస్పీ 6, ఎంఐఎం 8
7, ఇతర రాష్టాల గుర్తింపు 7 నామినేషన్లు సమర్పించారు. 3న ఉపసంహరణ అనంతరం పోటీ అభ్యర్థులు జాబితా స్పష్టం కానుంది.