Medak

News July 8, 2024

MDK: ఒంటరితనం భరించలేక యువతి ఆత్మహత్య

image

ఒంటరితనం భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్‌చెరు అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మాధవపురి హిల్స్ కాలనీలో ఉంటున్న రీనా(30)భర్తతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుని వర్క్ ఫ్రం హోం డ్యూటీ చేసుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగిస్తున్న 130 మాత్రలను ఒకేసారి మింగి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 8, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

image

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు

News July 8, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

image

మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నేడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుంచి 3 రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే గత రెండు రోజులుగా వర్షాలు పడడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు

News July 8, 2024

ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నా: జగ్గారెడ్డి

image

సంగారెడ్డిలో MLAగా ఓడిపోయి ప్రశాంతంగా ఉన్నానని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి జన్మదినోత్సవం సంద్భంగా నిర్వహించిన ర్యాలీలలో ఈ వాఖ్యలు చేశారు. ప్రజలు ఓడగొట్టామని ఫీల్ కావద్దని, తాను మనస్పూర్తిగా, దైవసాక్షిగా ప్రశాంతంగా ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ది విషయంలో జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజలకు ఏమేమి కావాలో చేసిపెడతానని హామీ ఇచ్చారు.

News July 7, 2024

కంగ్టి: అంత్యక్రియలకు వెళ్లి.. అనంత లోకాలకు

image

అంత్యక్రియలకు బైకుపై వెళ్లి, తిరిగి వస్తుండగా కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంగ్టి మండలం నాగూర్ (బీ)కి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగూర్ (బీ)కు చెందిన అరుణ్(34) బంధువుల అంత్యక్రియల కోసం ఈరోజు పక్కనే ఉన్న కర్ణాటక బీదర్ జిల్లా చీంకోడ్ గ్రామానికి వెళ్లి, తిరుగు ప్రయాణంలో దేశ్ ముఖ్ వడగం వద్ద తన బైకు అదుపుతప్పి బస్సును ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు.

News July 7, 2024

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇంటర్ విద్యార్హతతో ఉద్యోగాలు ఉన్నాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 3, 2004 – జనవరి 03, 2008 మధ్య జన్మించిన అవివాహిత మహిళా, పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మరిన్ని వివరాల కోసం https://agnipathvayu.cdac.inలో సంప్రదించాలని సూచించారు.

News July 7, 2024

సిద్దిపేట: ‘మట్టి స్నానం.. మహా ఆరోగ్యం’ 

image

మట్టి స్నానంలో మహా ఆరోగ్యమని యోగా గురు వంశీకృష్ణ అన్నారు. అది యోగా పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అదివారం సిద్దిపేటలోని వయోల గార్డెన్‌లో యోగా గురువులు బొజ్జ ఆశోక్, ఎలిగేటి కృష్ణమూర్తి, పెద్ది మనోహార్ ఆధ్వర్యంలో మట్టి స్నానం కార్యక్రమం నిర్వహించారు. మొదట కార్యక్రమానికి హాజరైన వారితో సూక్ష్మ యోగా ఆసనాల సాధన చేయించారు.

News July 7, 2024

MDK: కేసు ఉందని చెప్పి రూ.3 లక్షలు స్వాహా

image

ఓ విశ్రాంత ఉద్యోగికి మీ పై కేసు ఉందని బెదిరించి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు దోచేసిన ఘటన HYD పటాన్‌చెరు PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. GMR ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న విశ్రాంత ODF ఉద్యోగి శ్రీనివాస్‌కు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బ్యాంక్ అధికారులమని చెప్పారు. సామాజిక వ్యతిరేక విషయాలను ప్రచారం చేసినందుకు మీపై చెంబూరు PSలో కేసు నమోదైందని బెదిరించి డబ్బు కొట్టేయగా అతడు PSను ఆశ్రయించాడు.

News July 7, 2024

శివంపేట: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో అరికెల రమేశ్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన రమేశ్ పక్కనున్న గుడిసెలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుడిసెలో ఉరేసుకున్నట్లు ఉన్నప్పటికీ మరణంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 7, 2024

సంగారెడ్డి: నాటి పూర్వ విద్యార్థులే.. నేడు టీచర్లు

image

సంగారెడ్డి జిల్లా జోగిపేట బాలుర ఉన్నత పాఠశాల నాటి(పూర్వ) విద్యార్థులే నేడు టీచర్లు అయ్యారు. ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి ఆ ఛాన్స్ వచ్చింది. ఇటీవలి పదోన్నతులు, బదిలీల్లో వీరంతా జోగిపేటకు వచ్చారు. చిన్నప్పుడు చదువుకున్న బడిలోనే ఇప్పుడు పాఠాలు నేర్పే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదని టీచర్లు మాణయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్(PD), రమేశ్ కుమార్ అన్నారు.