India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని అధికారులకు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు, ఉద్యోగులు కలెక్టరేట్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పేదలకు అందేలా కృషి చేయాలని చెప్పారు.
సంగారెడ్డిలో నేడు మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీలో అమృత్ 2.0 కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా సమాఖ్య షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, సమాఖ్య పెట్రోల్ పంపుకు శంకుస్థాపన, మోడల్ ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేసి 108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తారు. జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్షించున్నారు.
ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివే అభ్యర్థులు ఈ నెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. పదవ తరగతి ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, ఇంటర్మీడియట్ ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని పేర్కొన్నారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 29 వరకు, రూ. 50 అపరాద రుసుంతో ఫిబ్రవరి 5వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా రేపు అన్ని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, సావిత్రి బాయి పూలే జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్‌ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్‌లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 282, సిద్దిపేటలో 87, నర్సపూర్ లో 7 చొప్పున మొత్తం 376 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోహిర్ 8.4, అల్గోల్ 9.1, న్యాల్కల్ 9.9, మల్చల్మ 10.0, నల్లవల్లి 10.2, సత్వార్ 10.3, మొగుడంపల్లి 10.9, అల్మాయిపేట, దిగ్వాల్ 11.1, లక్ష్మీ సాగర్ 11.6, ముక్తాపూర్ 11.7, బోడగాట్ 11.9, మునిగడప 12.0, జహీరాబాద్ 12.1, నర్సాపూర్, కొత్తపేట, కంది 12.2, దామరంచ, బేగంపేట 12.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రతి విద్యార్థి అభివృద్ధే లక్ష్యంగా సిబ్బంది పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ, కమిషనర్, ఎంజేపీ గురుకుల సొసైటీ కార్యదర్శి, ఆర్సీఓ, ప్రిన్సిపల్స్, జిల్లా అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. తరచుగా గురుకుల పాఠశాలల హాస్టల్స్ తనిఖీ చేయాలన్నారు. అలసత్వం వహించకుండా ప్రతి విద్యార్థిపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ 13.6, జహీరాబాద్, గుమ్మడిదల 14.1, న్యాల్కల్ 14.3, ఆర్సీపురం 14.6, ఝరాసంగం 14.7, అందోల్, మొగుడంపల్లి 14.8, మెదక్ జిల్లాలోని శివంపేట 15.0, టేక్మాల్, నర్సాపూర్ 15.6, వెల్దుర్తి 15.9, సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ 15.1, వర్గల్, ములుగు 15.5, కుకునూరుపల్లి 16.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్‌లో నమోదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.