India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది నేటితో పూర్తవుతోంది. అయితే మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రజలకు ఈ సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. చేసిన తప్పుల నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని ఉంటారు. వాటన్నింటిని సరిదిద్దుకునే ప్రయత్నమూ చేసుంటారు. మరీ ఈ ఏడాది మీరేం సాధించారు? ఏం కోల్పోయారు? ఏం నేర్చుకున్నారు? మీ మధుర జ్ఞాపకాన్ని కామెంట్ చేయండి.
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ హుడా లే అవుట్ వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికుల వివరాలు.. యూటర్న్ తీసుకునే క్రమంలో టిప్పర్, బైక్ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు హరీశ్, బన్నీ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న కొల్లూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
2024కి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చిన్నాపెద్ద సిద్ధమయ్యారు. యువతులు న్యూ ఇయర్ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేసి 2025కి వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉండగా.. యువకులు పార్టీలు, దావత్‌లు అంటూ ఫుల్ జోష్ మీద ఉన్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి న్యూ ఇయర్‌కు మీప్లాన్స్ ఏంటో కామెంట్ చేయండి.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది.. దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. రామక్కపేటకి చెందిన అనుముల లింగం (48) అనే వ్యక్తి ఆదివారం తన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చంద్రకాంత్ అనే వ్యక్తి తన భార్య నవ్య, కూతుళ్లు తన్వి, తన్విశ్రీతో కలిసి సోమవారం ఏడుపాయల వనదుర్గ మాత దర్శనానికి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డుపై కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య, కూతుళ్లకు గాయాలు కాగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో నవ్య చనిపోయింది.
నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 30, 31 రెండు రోజులపాటు విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డైవ్ తనిఖీల్లో పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తిరుమల దర్శనం అనుమతి ఇచ్చినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖకు స్పందించి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
నేడు మెదక్ – నిజామాబాద్- అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల జాబితాను ఫైనల్ చేసి ఓటరు జాబితాను ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ జాబితా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో నమోదైన ఉపాధ్యాయులు, అలాగే పట్టభద్రులు తమ ఓటర్ జాబితా వివరాలను పరిశీలించి, సరిచూసుకోవాలని అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉత్తరం రాశారు. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించాలాని హరీశ్‌రావు ఉత్తరంలో పలు సూచనలు చేశారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవించాలని, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉత్తరం ద్వారా చైతన్యం తెచ్చారు.
తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందిందన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఏనాడు విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగడని హరీశ్ రావు కొనియాడారు.
Sorry, no posts matched your criteria.