India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతిని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన మూగ చిత్ర కళాకారుడు గూడూరు ఆగమప్ప అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసి శనివారం నివాళులర్పించారు. భారతదేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేసిన అబ్దుల్ కలాం భారతరత్నతో పాటు అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారని ఆర్టిస్టు పేర్కొన్నాడు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 14.066 టీఎంసీల నీరు ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 1,595 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 391 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు.
అనారోగ్యాన్ని తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. బీడీఎల్ సీఐ స్వామిగౌడ్ వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఘన్పూర్ గ్రామంలో ఉంటున్న రేవతి(17) మూర్ఛతో బాధపడుతోంది. తల్లిదండ్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా మార్పు రాకపో వడంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రేవతి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు
ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మసస్తాపం చెందిన యువతి పురుగు మందు తాగింది. సిద్దిపేట 3-టౌన్ CI తెలిపిన వివరాలు.. కొండపాక మండలానికి చెందిన యువతి, ఖమ్మంపల్లి వాసి నితీశ్ ప్రేమించుకున్నారు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా యువకుడు నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులు మాట్లాడినా యువకుడు పెళ్లికి నో చేప్పడంతో ఈనెల 10న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. కేసు నమోదైంది.
MDK: వర్షాకాలం పంటలు ప్రారంభం అయ్యాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నాటు వేసే కూలీలు కూలీ రేట్లు పెంచారు. గతంలో రూ.400 ఉన్న కూలీలు ఇప్పుడు రూ.500 లేదా రూ.550 కూలీకి వస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 50% నాట్లు పూర్తయ్యాయి. కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో ఎక్కువ రేట్లతో కూలీలను తీసుకుపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే దీనికి ముఖ్య కారణం అని వారు చెబుతున్నారు.
పాపన్నపేట: నేరస్థులు తప్పు చేయాలంటే భయపడాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ధైర్యం నింపాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 వ్యవస్థపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
సెల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగలించబడిన సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. సెల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తే సంబంధిత దుకాణ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగలించిన సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
317 జీవోపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం అయ్యింది. గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. ఎవరికైతే 317 జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్16 ఎంపికలు ఈనెల 28న జూబ్లీ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 1-9-2008 నుంచి 31-8-2010 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. ఆధార్ కార్డు, బోనాఫైడ్, జనన ధ్రువీకరణ పత్రం, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో అద్భుతంగా ఆడి తెలంగాణ పేరు నిలబెట్టాలని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఫాల్గుణ సూచించారు. 15 రోజులుగా సిద్దిపేటలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ ఎంపిక, శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.