India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చంద్రకాంత్ అనే వ్యక్తి తన భార్య నవ్య, కూతుళ్లు తన్వి, తన్విశ్రీతో కలిసి సోమవారం ఏడుపాయల వనదుర్గ మాత దర్శనానికి కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రధాన రోడ్డుపై కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య, కూతుళ్లకు గాయాలు కాగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యలో నవ్య చనిపోయింది.
నూతన సంవత్సర వేడుకల పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డిసెంబర్ 30, 31 రెండు రోజులపాటు విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు ఉంటాయని పేర్కొన్నారు. డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డైవ్ తనిఖీల్లో పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తిరుమల దర్శనం అనుమతి ఇచ్చినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖకు స్పందించి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని చెప్పారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
నేడు మెదక్ – నిజామాబాద్- అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల జాబితాను ఫైనల్ చేసి ఓటరు జాబితాను ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ జాబితా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో నమోదైన ఉపాధ్యాయులు, అలాగే పట్టభద్రులు తమ ఓటర్ జాబితా వివరాలను పరిశీలించి, సరిచూసుకోవాలని అన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉత్తరం రాశారు. మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధపెట్టి చదివించాలాని హరీశ్‌రావు ఉత్తరంలో పలు సూచనలు చేశారు. కష్టంగా కాకుండా ఇష్టంగా చదవించాలని, మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉత్తరం ద్వారా చైతన్యం తెచ్చారు.
తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అసెంబ్లీలో మాట్లాడుతూ గుర్తు చేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందిందన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఏనాడు విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగడని హరీశ్ రావు కొనియాడారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రెండో రోజు సోమవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 వరకు లక్ష బిల్వార్చన, మహామంగళహారతి, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్ర నగర్ చెందిన ఓ యువతి(22) ప్రేమ విఫలం కావడంతో ఒక ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ సంబంధం అంటగట్టి బెదిరింపులకు పాల్పడడంతో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు కొల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. నర్సాపూర్ చెందిన ఓ టిఫిన్ సెంటర్ యజమాని దివ్య హెడ్ కానిస్టేబుల్‌తో ఫోన్లో మాట్లాడింది. ఇది గమనించిన ఆమె భర్త, అల్లుడు చంపుతామని బెదిరించారు. దీంతో సాయి ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
మెదక్ జిల్లాలో ఆదివారం ఉ.గం.8.30 వరకు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. చిలప్ చెడ్ 16.3, టేక్మాల్, కౌడిపల్లి 16.8, టేక్మాల్ 17.0, వెల్దుర్తి 17.1, కుల్చారం, పాపన్నపేట, పెద్దశంకరంపేట 17.4, అల్లాదుర్గ్ 17.5, శివ్వంపేట్ 17.6, మనోహరాబాద్, నార్సింగి 18.0, నర్సాపూర్ 18.1, చేగుంట 18.2, తూప్రాన్ 18.3, రామాయంపేట 18.4, రేగోడ్ 18.6, మెదక్, హవేళిఘనపూర్ 18.9, చిన్న శంకరంపేట19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.
Sorry, no posts matched your criteria.