Medak

News July 20, 2024

సంగారెడ్డి: ‘విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తాం’

image

విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News July 20, 2024

SRD: ‘భారీ వర్షాలు.. ప్రజలను అప్రమత్తం చేయండి’

image

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం లో తెలిపారు. వరదల వల్ల నష్టం జరగకుండా అధికారులు మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అందుబాటులో ఉండాలని చెప్పారు. చెరువు కట్టలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

News July 20, 2024

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి: కలెక్టర్ క్రాంతి

image

అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. డ్రైడే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్ల ముందు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి, కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.

News July 19, 2024

మెదక్ కలెక్టర్‌కు అభినందనల వెల్లువ

image

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీలో పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ద్వారా భారతీయ పాలన, ప్రజా విధానం అంశంపై బంగ్లాదేశ్‌కు చెందిన డిప్యూటీ కమిషనర్స్, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. దేశంలో సుపరిపాలనపై చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమాలను పవర్ పాయింట్ ద్వారా తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఇతర దేశస్తులు రాహుల్ రాజ్‌ను అభినందించారు.

News July 19, 2024

తూప్రాన్‌: ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స

image

తూప్రాన్‌లో ఓ హోటల్లో భోజనం చేసిన పలువురు తీవ్ర అస్వస్థత గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు.. నూతన వెరైటీలతో పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ హోటల్లో మంగళ, బుధవారాల్లో పలువురు బిర్యానీ తిన్నారు. ఒక్కొక్కరుగా 15 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొదట నార్మల్‌గా తీసుకున్న వారు హోటల్ ఫుడ్‌ పాయిజన్ కావడంతో ఆందోళన చెందారు.

News July 19, 2024

సికింద్రాబాద్‌ బోనాలకు రావాలని KCRకు ఆహ్వానం

image

HYD ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు‌ రావాలని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో KCRను సికింద్రాబాద్‌ MLA పద్మారావు‌ గౌడ్, ఆయన కుమారులు మర్యాదపూర్వకంగా కలిశారు. బోనాల జాతరకు రావాలని ఆహ్వానించారు. ప్రతి ఏటా లష్కర్‌ బోనాలకు‌ వచ్చే కేసీఆర్‌, టక్కర్‌బస్తీలోని పద్మారావు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.

News July 19, 2024

మెదక్: కొత్త డీఎంకు స్వాగతం.. పాత డీఎంకు వీడ్కోలు

image

మెదక్ ఆర్టీసీ డీపో మేనేజర్‌గా సురేఖ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్ నుంచి ఇక్కడికి బదిలీపై రాగా ఇక్కడ డీఎంగా పనిచేసిన సుధా బీహెచ్ఈఎల్‌ కు బదిలీ అయ్యారు. శుక్రవారం డిపో గ్యారేజ్ ఆవరణలో కొత్తగా వచ్చిన డీఎం సురేఖ, బదిలీపై వెళుతున్న డీఎం సుధను ఆర్టీసీ డిపో అధికారులు సిబ్బంది సన్మానించారు. సుధా సేవలను కొనియాడారు. అందరి సహకారంతో డిపోను అభివృద్ధి పథంలో ఉంచుతానని సురేఖ తెలిపారు.

News July 19, 2024

మెదక్: EMT ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 19, 2024

మెదక్: EMT ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 19, 2024

మెదక్: యాసిడ్ తాగి వ్యక్తి మృతి

image

అప్పులు తీర్చలేక ఓ వక్తి యాసిడ్ తాగాడు. ఈ ఘటన తూప్రాన్‌లో జరిగింది. ఎస్సై శివానందం వివరాలు.. పట్టణానికి చెందిన నరసింహచారి(40) నాలుగేళ్ల క్రితం ఇల్లు కొనుగోలు చేశాడు. బ్యాంకులో రూ.17లక్షలు, ఇతరుల వద్ద రూ.6లక్షలు అప్పు చేశాడు. డబ్బు చెల్లించే పరిస్థితి లేక తన దుకాణంలో బంగారం కరిగించేందుకు ఉపయోగించే యాసిడ్ సేవించాడు. పక్కనే ఉన్న దుకాణదారుడు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.