India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనే
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు ఈనెల 22లోగా ఫారం- 12 ను సమర్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. 22 తర్వాత సమర్పించే ఫారాలు పరిగణనలోకి తీసుకోబడవని ఆమె స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

2024-25 విద్యా సంవత్సరానికి గాను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్సియల్ వసతి కలిగి విద్యాబోధనలతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండి కాంపీటేటివ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత శాతాన్ని కలిగి ఉన్న కళాశాలలు ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని షె.కు.అ.శాఖ ఉపసంచాలకులు తెలిపారు. ఆసక్తి గల కళాశాలలు నేటి వరకు 5 ఏళ్లకు సంబంధించిన అకాడమిక్ ప్రొఫైల్ తో పాటు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

లోక సభ ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నల్గొండ జిల్లాకు వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ 2012 బ్యాచ్ కి చెందిన కళ్యాణ్ కుమార్ దాస్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రానికి రాగా, ఆర్ అండ్ బి అతిథి గృహంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్ పూలబోకేతో స్వాగతం పలికారు. వీరు లోకసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు.

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌కు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో మల్లేశ్ B-ఫారమ్ అందుకున్నారు. భువనగిరిలో గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులున్నారు.

NLG పార్లమెంట్ స్థానానికి తొలి రోజు నలుగురు అభ్యర్థులు 6 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. చోల్లేటి ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థిగా 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, BJP అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరఫున ఆ పార్టీ నేత ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

ఓటర్లలో సగ భాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యవంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్‌సభకు పంపలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల ఓట్లను రాబట్టుకునేందుకు వారిని ఆకర్షించే పథకాలను, హామీలను ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటిస్తున్నాయి కానీ మహిళా అభ్యర్థులను బరిలో నిలపడం లేదు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో రాజకీయ పార్టీ అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. నామినేషన్ల కేంద్రాలు నల్గొండ జిల్లాలో ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా నిఘా కట్టుదిట్టం చేశామని తెలిపారు.

ధర్మ సమాజ్ పార్టీ నుంచి భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా కొంగరి లింగస్వామి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆయనకు పార్లమెంటు టికెట్ కేటాయిస్తూ బీ ఫామ్ అందించారు. లింగస్వామి స్వగ్రామం సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. టికెట్ కేటాయించడంతో పలువురు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో మూగజీవాలకు పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యశాలల్లో సిబ్బంది కొరతతో పాటు సరిపడా వసతులు లేక పశువులకు సరైన వైద్యం అందడం లేదు. NLG, SRPT, యాదాద్రి BNG జిల్లాల్లోని పశువైద్యశాలల్లో గడిచిన పదేళ్ల కాలంగా ఖాళీ పోస్టులు భర్తీకి నోచుకోకపోవడం లేదు. దీంతో మూగజీవాలకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రబలి పశువులు మృతి చెందుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు.

డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.