News March 16, 2024

సూర్యాపేట: కారు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

image

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో గరిడేపల్లి మండలం మర్రికుంట దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో మట్టంపల్లి మండలం బిల్లా నాయక్ తండాకు చెందిన నవీన్ మృతి చెందాడు. గరిడేపల్లి నుండి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 12, 2025

నల్గొండ: పార్ట్ టైమ్ ఉపాధ్యాయ పోస్ట్‌కు దరఖాస్తులు

image

నల్గొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ స్వామీ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఎంఏ, బీఏ, హెచ్‌పీటీ (HPT) విద్యార్హత కలిగి ఉండాలి. డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం 7995010669 నంబర్‌ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

News December 12, 2025

నల్గొండలో కాంగ్రెస్- 19, బీఆర్ఎస్- 11 బీజేపీ- 1

image

నల్గొండ మండల వ్యాప్తంగా గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 19 స్థానాల్లో విజయం సాధించి తమ పట్టు నిలుపుకున్నారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు 11 స్థానాల్లో గెలిచి సత్తా చాటగా, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాగా, రసూల్‌పుర, కోదండపురం గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News December 12, 2025

కోమటిరెడ్డి స్వగ్రామంలో విజయం ఈయనదే..

image

నార్కట్ పల్లి మండలం గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన చిరుమర్తి ధర్మయ్య విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన బుర్రి రాములుపై 779 ఓట్ల తేడాతో ధర్మయ్య విజయం సాధించారు. బుర్రి రాములు విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బ్రాహ్మణ వెల్లంల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వగ్రామం.