India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు, మున్సిపల్, పంచాయతీ అధికారులు రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, తదితరులతో సీజనల్ వ్యాధులు, ఇతర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యాధికారులు వారి ప్రాంతాలలో అవసరమైతే మరోసారి జ్వర సర్వే నిర్వహించాలన్నారు.
ఓటరు జాబితాకు సంబంధించి మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత ఎన్నికలు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం కొండమల్లేపల్లిలో గంజాయి సేవించి పట్టుబడిన యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు, డీఎస్పీ గిరిబాబు, సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్గొండలోని ఏఆర్ నగర్లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భర్త వెంకన్నను భార్య మైసమ్మ హత్య చేసినట్లు సమాచారం. హత్యకు అక్రమ సంబంధం కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని సెల్ఫీ ఫొటో తీసుకుంటూ వివరాలను నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ సామూహిక ఉచిత వ్రతాల నిర్వహణకు దేవస్థానం నిర్ణయించింది. యాదాద్రి కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళా భక్తులు తమ పేర్లను గురువారం సాయంత్రం 5 గంటల లోగా నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.
రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో దాదాపు 6 వేల మంది సెకండ్ ANMలు పనిచేస్తున్నారని వీరందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో సెకండ్ ANMలను రెగ్యులర్ చేశారని.. మన రాష్ట్రంలో కూడా సెకండ్ ANMలను రెగ్యులర్ చేయాలన్నారు.
నల్గొండ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత మూత్రపిండాల చికిత్స పొందుతున్న వారిలో అధికంగా ఈ జిల్లా వాసులే ఉన్నట్లు ఇటీవల నేమ్స్ ఆసుపత్రి బృందం నిర్వహించిన సర్వేలో తేలింది. జిల్లాలో పీపీపీ పద్ధతిలో 55 పడకల ద్వారా నిత్యం 472 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. NLG పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది.
రోడ్డు బాలేదన్న వంకతో కొన్నేళ్లుగా మునుగోడు మండలం పలివెల గ్రామం మీదుగా ప్రతి రోజు HYDకు వెళ్లే బస్సు సర్వీసును బుధవారం ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నిత్యం ఉదయం 8:30 గంటలకు NLG డిపో నుంచి బయలుదేరే ఆ బస్సు మునుగోడు మీదుగా కచలాపురం , పలివెల, కోతులారం, మల్లారెడ్డిగూడెం, సర్వేల్ నుంచి HYDకు వెళ్లేది. తిరిగి మధ్యాహ్న సమయంలో అదే గ్రామాల మీదుగా NLGకు చేరుకునేది.
నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.
Sorry, no posts matched your criteria.