Nalgonda

News March 18, 2026

NLG: రైతు భరోసాకు దరఖాస్తుల ఆహ్వానం

image

యాసంగి సీజన్ రైతు భరోసా కోసం కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులంతా ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ కుమార్ తెలిపారు. 5,21,577 మంది రైతులకు రైతు భరోసా అందుతోందని, జిల్లాలో 20,568 మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని.. వారంతా ఈ నెల 25లోగా తమ వ్యవసాయ విస్తరణ అధికారులకు దరఖాస్తులు అందజేయాలని కోరారు.

News March 18, 2026

నల్గొండ: కారు ఢీకొని ఒడిశా యువకుడి మృతి

image

పెద్దవూర సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన రామ్ రే (23)ను అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతను కాటన్ మిల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2026

చండూరు ఘటనపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

image

నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

News March 17, 2026

ఉగాదికి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఉగాది పర్వదినం నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేల సమన్వయంతో గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న ఇండ్లు, మరుగుదొడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని సూచించారు.

News March 17, 2026

ప్రచార రథాన్ని ప్రారంభించిన నల్గొండ కలెక్టర్

image

“ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.

News March 17, 2026

బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని నల్గొండ కలెక్టర్ ఆదేశం

image

రానున్న బత్తాయి సీజన్‌కు ఎస్ఎల్బీసీ వద్ద ఉన్న బత్తాయి మార్కెట్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన ఛాంబర్‌లో బత్తాయి మార్కెట్‌పై ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బత్తాయి పంట, బత్తాయి వెరైటీలు, ఉత్పత్తి, విస్తీర్ణం, దిగుబడులు, బత్తాయి సాగు చేస్తున్న రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News March 17, 2026

NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

image

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.

News March 17, 2026

NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

image

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.

News March 17, 2026

NLG: మొదటి విడత కంప్లీట్… రెండో విడతకు కసరత్తు

image

జిల్లాలో వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండో విడత యాంత్రీకరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగులో యంత్రాల వాడకాన్ని పెంచి, రైతులకు శ్రమ, పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.4 కోట్ల భారీ నిధులు కేటాయించనున్నది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో రూ.4 కోట్ల వ్యయంతో 1,900 మంది రైతులకు ప్రభుత్వం విజయవంతంగా పరికరాలను అందజేసింది.

News March 17, 2026

నల్గొండ: ఊరి శివారులో యువకుడి మృతదేహం

image

శాలిగౌరారం మండలం కొండారం శివారులో రోడ్డు పక్కన ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.