India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నార్కట్ పల్లి మండలం తొండల్ వాయికి చెందిన గీత కార్మికుడు దంతూరి శంకర్ బుధవారం సాయంత్రం పాముకాటుతో మరణించారు. గ్రామ సమీపంలోని తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పాము కాటు వేసిందని, కిందికి దిగిన శంకర్ తోటి గీత కార్మికుడికి విషయం చెప్పి కిందపడిపోయాడని స్థానికులు తెలిపారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TGSRTC బస్సుల్లో డిజిటల్ చెల్లింపులను అమలులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఐ-టిమ్స్ మెషీన్లను ప్రవేశపెట్టనుంది. తొలి విడతలో భాగంగా 310 మెషీన్లను కొనుగోలు చేసింది. దీంతో నల్గొండ రీజియన్లోని నార్కట్ పల్లి, నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ డిపోల ప్రయాణికులకు చిల్లర బాధలు తప్పనున్నాయి.
నల్గొండ రాక్ హిల్స్ కాలనీకి చెందిన విద్యార్థిని రేష్మిత వరంగల్లో ఉరేసుకొని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ ములుగు రోడ్డులోని వ్యవసాయ కాలేజీలో రేష్మిత ఫస్టియర్ చదువుతోంది. ముభావంగా ఉండడంతో ఇటీవలే ఇంటికి తీసుకొచ్చి మళ్లీ కాలేజీకి పంపించారు. బుధవారం శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెళ్లగా బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
నల్గొండ – KMM- వరంగల్ టీచర్ MLC ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలలో 752 మంది సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నామని వెల్లడించారు. జిల్లాలో 4,683 ఓటర్లు ఉన్నారని, ప్రతీ పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టోరల్ ఆఫీసర్ చొప్పున నియమించామని, 19 మంది పోటీలో ఉండగా జిల్లాలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణకు పోలింగ్ సిబ్బంది నల్గొండ నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నికల సామాగ్రిని అధికారులు పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎన్నికల సామాగ్రితో సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూట్ బస్సులలో బయలుదేరారు.
చండూరు మండలం నెర్మటలో పండుగ పూట తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో దోటి లింగయ్య (45) అనే వ్యక్తి మృతిచెందాడు. ఉదయం పొలం దగ్గరకు వెళ్లొచ్చాడని అంతలోనే ఛాతిలో నొప్పు వస్తుందని కుప్పకూలాడని గ్రామస్థులు తెలిపారు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్ డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. NLG డీఎంహెచ్ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నిషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజూ పీహెచ్సీలకు వచ్చే రోగుల రక్తనమూనాలు సేకరించి తెలంగాణ హబ్కు పంపాలన్నారు.
జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఈ-పాలన అటకెక్కింది. టీ ఫైబర్ పథకంలో భాగంగా ప్రతి పంచాయతీల్లో కేబుల్తో పాటు పరికరాలు బిగించి కనెక్షన్ ఇవ్వడం మరిచారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతీ పంచాయతీలో ఈ పాలన, ఇంటింటికి తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించాలన్న లక్ష్యంతో 2017లో ప్రభుత్వం టి ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
భువనగిరిలో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. కుటుంబసబ్యులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనూషకు ఈ నెల 14న నిశ్చితార్థం జరగ్గా, వచ్చే నెల 6న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు.ఈ క్రమంలో అనూష తను అద్దెకు ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని సహోద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది.
WGL- KMM – NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పిరియడ్ అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించొద్దని తెలిపారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు టీఎస్ఎస్పీ సిబ్బందితో పాటు దాదాపు 600 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.