India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏటీసీ (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్), ఐటీఐల్లో 2025-27 సంవత్సరంలో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా ఐటీఐల కన్వీనర్ ఎ.నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 30లోగా http://iti.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేయడంతో పాటు మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

జిల్లాకు ఈ సీజన్లో సుమారు 70 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రభుత్వం ఇప్పటివరకు 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అందులో పీఏసీఎస్, ఆగ్రో సెంటర్లకు 28 వేల టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 20వేల టన్నులు అలాట్ చేశారు. ఇంకా జిల్లాకు 22 వేల మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. ప్రభుత్వం దశల వారీగా యూరియా సరఫరా చేస్తున్నా.. పంటల అదునుకు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూడు జిల్లాల్లో మూడు జిల్లా ప్రజాపరిషత్‌లు, 33 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఖరీదైన కార్లలో రాత్రి వేళల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నాలుగు ముఠాలకు చెందిన 16 మంది సభ్యులను అరెస్టు చేశామని, వారు మొత్తం 26 నేరాలలో 200లకు పైగా మేకలను దొంగిలించారని ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుండి రూ.2.46 లక్షల నగదు, రూ.2.75 లక్షల విలువైన 22 గొర్రెలు, రూ.47 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కొండమల్లేపల్లి మండలంలో జాతీయ రహదారిపై విషాదం జరిగింది. బొలెరో వాహనం ఢీకొని బాలిక మృతిచెందింది. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై బాపూజీ నగర్ వద్ద రోడ్డు దాటుతున్న బాలిక అక్షరను వాహనం ఢీకొట్టడంతో చనిపోయిందని స్థానికులు తెలిపారు. బాపూజీనగర్‌కి చెందిన పిట్ల రాజా-సంధ్య కూతురు అక్షర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద నల్గొండ జిల్లాలో 3500 మందికి లబ్ధి చేకూర్చవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకునే విధంగా పథకం గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

నల్గొండ MGUలో కొత్తగా ఫార్మసీ, లా, ఎడ్యుకేషన్ కళాశాలలను నెలకొల్పనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రతిపాదనలు అందజేసినట్లు తెలిసింది. ఈ వర్సిటీ పరిధిలో బీఫార్మసీ, లా, బీఈడీ కళాశాలలు ఉండటం.. వాటిని పర్యవేక్షించేందుకు MGUలో అందుకు సంబంధించిన కళాశాలలు లేక పోవడంతో నిపుణుల కోసం ఇతర వర్సిటీలపై ఆధారపడాల్సి వస్తోంది. కళాశాలల మంజూరుపై వాడపల్లి నవీన్ హర్ష వ్యక్తం చేశారు.

జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతుల కోలాహలం కొనసాగుతుంది. 2024లో కూడా ప్రభుత్వం పదోన్నతులను ఆన్లైన్లో చేపట్టినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు స్పౌజ్, హెల్త్ వంటి అంశాలపై తప్పుడు సమాచారం ఇవ్వడంతో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో 37 SAలకు జిహెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. తాజాగా SGTలకు LFL హెచ్ఎంలుగా, SAలుగా168 మందికి పదోన్నతులు కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం ఇస్తామన్న ప్రభుత్వ హామీ మాటగానే మిగిలిపోయింది. జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ మంది పేద కుటుంబాల విద్యార్థులే ఉన్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకునే పరిస్థితి లేక చాలా మంది విద్యార్థులు రోజంతా పస్తులతో ఉంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, ఇతర సామాగ్రి కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ పీడీని దీనికి నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక ట్యాక్స్ నిధులు పంచాయతీరాజ్ శాఖ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.