India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా నిఘాను, తనిఖీలను తీవ్రతరం చేయాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టే విషయమై గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి అధికారులతో ఉదయాదిత్య భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ద్వారా ఆయా ఇసుక రీచ్ లలో అనుమతించిన వాహనాలు, అనుమతించిన వారికి మాత్రమే ఇసుకను తీసుకువెళ్లే అధికారం ఉందని అన్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా.. థార్ గ్యాంగ్‌కు చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరెస్ట్ వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, ప్రధాన నిందితుడిపై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు ఉన్నాయని అన్నారు. అతడి నుంచి రూ.25 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నల్గొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆస్థి పన్ను సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ మేళా నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ హమ్మద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో భాగంగా ప్రతి మంగళ, గురు, ఆదివారాలలో దరఖాస్తులు స్వీకరించబడునని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో ఫిర్యాదుల విభాగాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె కలెక్టరేట్ నుంచి రైతు భరోసాపై జిల్లా, మండల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతలో భాగంగా సుమారు 12వేల ఎకరాలు వరకు వ్యవసాయ యోగ్యంకాని భూములను గుర్తించామన్నారు.
జిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల (అంధ, బధిర, మానసిక, శారీరక దివ్యాంగులు)కు ఉపకార వేతనాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి కేవీ.కృష్ణవేణి తెలిపారు. దరఖాస్తులను మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ ఈ నెల 23న రానున్నారు. సీఎంతో పాటు ఆరుగురు మంత్రులు కూడా రానున్నట్లు సమాచారం. సీఎం రానున్న నేపథ్యంలో బుధవారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్యర్ యాదగిరికొండ కింద హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.
మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలకు కొత్త అధ్యక్షులను త్వరలో ఎన్నుకోనున్నారు.
హాలియా SBI బ్రాంచ్ సమీపంలో చోరీ జరిగింది. పోలీసుల వివరాలిలా.. బుధవారం పెద్దవూర మం. తెప్పలమడుగుకి చెందిన కొండలు రూ.2లక్షలు డ్రా చేశారు. బైక్ కవర్‌లో పెట్టి DVK రోడ్‌లోని ఫర్టిలైజర్ షాపులోకి వెళ్లాడు. తిరిగొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి డబ్బు దొంగిలించారు. అనుమానితుల దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హాలియా SI సతీశ్ తెలిపారు.
రైతు భరోసా ఫిర్యాదుల స్వీకరణకు జిల్లాలోని అన్ని మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాలలో వెంటనే ఫిర్యాదుల విభాగాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె రైతు భరోసాపై జిల్లా, మండల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు భరోసా సర్వే సందర్భంగా కొన్ని సబ్ డివిజనల్ సర్వే నంబర్లలో వ్యవసాయ యోగ్యం కాని భూమిని గుర్తించామన్నారు.
వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల నుంచి సరఫరా చేసే ఇసుకపై పూర్తి నిఘా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మైనింగ్, తదితర శాఖల అధికారులతో కలిసి శాలిగౌరారం మండలం, వంగమర్తి, ఇటుకల పహాడ్ ఇసుక రీచ్‌ల వద్ద ఇసుక తవ్వే ప్రాంతాలను తనిఖీ చేశారు.
Sorry, no posts matched your criteria.