India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నల్గొండ జిల్లాలో మరికొన్ని పంచాయతీలు ఏర్పడనున్నాయి. గత ప్రభుత్వం తండాలు, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో మరికొన్ని గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ రావడంతో దీన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసింది. జిల్లాలో కొత్తగా 24 గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి.
ఇవాళ దేశమంతా స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటోంది. సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగరేస్తోంది. అయితే ఆ జెండాను రూపొందించింది మన సూర్యాపేట జిల్లాలోనే. జాతీయ జెండాను పింగళి వెంకయ్య నడిగూడెం కోటలోనే రూపకల్పన చేశారు. జమిందార్ రాజానాయిని రంగారావు మిత్రుడైన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపకల్పన చేయగా, 1921 ఏప్రిల్ 1 తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో గాంధీజీ ఆమోదించారు.
నల్గొండ జిల్లాలో మూడో విడతగా రూ.2లక్షల వరకు రుణమాఫీ నగదు రైతుల ఖాతాలో గురువారం జమ కానున్నాయి. రుణమాఫీకి అర్హులైన ఖాతాలు 35,501 ఉన్నట్లు జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. జులై 18న మొదటి విడత రూ.లక్ష వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది. జులై 30న రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేశారు. మూడో విడతలో జిల్లాలో 35,501 ఖాతాలుండగా.. 26,586 కుటుంబాలకు రూ.442.87 కోట్లు నిధులు జమ కానున్నాయి.
మువ్వన్నెల కాంతుల్లో నాగార్జునసాగర్ మెరిసిపోతోంది. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు దేదీప్యమానంగా వెలిగేలా సాగర్ క్రస్ట్ గేట్లను ముస్తాబు చేశారు. మువ్వన్నెల కాంతుల సొబగులతో ప్రాజెక్టు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సూర్యాపేటలో పరేడ్ గ్రౌండ్లో జరిగే 78వ భారత స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ నాగేశ్వరావుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వేడుకలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారన్నారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భువనగిరి మైనార్టీ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బాదం ఆకుపై తెలంగాణ 33 జిల్లాల చిత్రపటంతో పాటు 78వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపేలా చిత్రాలు గీశారు. విద్యార్థులను, వారికి మెలకువలు నేర్పిన ఆర్ట్స్, క్రాఫ్ట్స్ టీచర్ శ్రీనును ప్రిన్సిపల్ అభినందించారు. మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆర్ట్స్ & క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులపై వచ్చే ఫిర్యాదుల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, PHC కేంద్రాలలోని డాక్టర్లు , సిబ్బంది వారి వారి ఆసుపత్రులపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఆయన కోరారు. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ,దేశవ్యాప్తంగా యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని.. వాటి భారీ నుంచి యువతను కాపాడాలని అన్నారు.
నాగార్జునసాగర్ జలాశయ సమాచారం..
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం: 589.90 అడుగులు
నీటి నిల్వ సామర్థ్యం: 312.45 టీఎంసీలు
ప్రస్తుత నిల్వ: 311.74 టీఎంసీలు
ఇన్ ఫ్లో 46,839 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 46,839 క్యూసెక్కులు
గుండ్లపల్లి (డిండి) మండలం టీ.గౌరారం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది పంబాల వేణుగోపాల్‌ను హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళిత నిరుపేద కుటుంబానికి చెందిన కాశమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించిన పంబాల వేణుగోపాల్ దేవరకొండలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు.
Sorry, no posts matched your criteria.