Nalgonda

News February 12, 2025

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి 

image

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.

News February 12, 2025

NLG: మహిళా టీచర్ల సమస్యల పరిష్కారానికే పోటీ: అర్వ స్వాతి

image

మహిళా టీచర్ల సమస్యలను కౌన్సిల్లో తీర్చేందుకే స్వతంత్ర మహిళ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి అర్వ స్వాతి తెలిపారు. తన నామినేషన్ స్క్రూటినీలో ఓకే అయిన సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 4 సార్లు జరిగిన ఎన్నికలలో మహిళలు పోటీలో లేరని, మెజారిటీ మహిళలు సంఘ బాధ్యులుగా లేని కారణంగా ఏ సంఘం మహిళా అభ్యర్థులను పోటీకి నిలపలేదని, పురుష అభ్యర్థులను గెలిపిస్తే మహిళల సమస్యలు పరిష్కరించలేదన్నారు.

News February 12, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ. 16,45,100

image

చెర్వుగట్టు శ్రీపార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. పది రోజులకు గాను అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,19,600లు, స్వామివారి హుండీ ఆదాయం రూ. 13,25,500లు లభించినట్లు ఆలయ ఈవో నవీన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ నల్గొండ డివిజన్ పరిశీలకురాలు బి. సుమతి, దేవస్థాన పర్యవేక్షకులు జి. తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

News February 11, 2025

NLG: రూ.113.33 కోట్ల రైతు భరోసా జమ

image

జిల్లాలో రెండెకరాలలోపు భూమి ఉన్న 1,85,545 మంది రైతుల ఖాతాల్లో రూ.113,33,74,857 రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకు ముందు జనవరి 26న 31 మండలాల్లో ఎంపిక చేసిన 31 గ్రామాల రైతులకు 35,568 మంది రైతుల ఖాతాల్లో 46,93,19,160 జమ చేసింది. మిగతా రైతులకు దశలవారీగా డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

News February 11, 2025

నల్గొండ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి 

image

నేరడిగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామ శివారులో విషాదం జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కేతావత్ చెన్నా పొలం దగ్గర ఓ వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. అడవి పందుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగలడంతో ఈ విషాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 11, 2025

దామరచర్ల పీహెచ్సీని తనిఖీ చేసిన ఇలా త్రిపాఠి 

image

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు రికార్డులన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని NLG కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె దామరచర్ల పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వైద్యుల హాజరు రిజిస్టర్, మందుల రిజిస్టర్లను, అలాగే స్టాక్ తదితర రిజిస్టర్లు అన్నిటిని తనిఖీ చేశారు. 

News February 11, 2025

తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.

News February 11, 2025

నల్గొండ: ఓటరు జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్‌ ఓటరు జాబితాను సోమవారం విడుదల చేశారు. NLG సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో 33 జడ్పీటీసీ, 352 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారు చేశారు. సోమవారం ఆ జాబితాను జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ఉంచారు. ప్రాదేశిక ఓటర్లు జిల్లాలో మొత్తం మొత్తం 10,77,817 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 5,33,333 మంది, మహిళలు 5,44,429 మంది, ఇతరులు 55 మంది ఉన్నారు.

News February 11, 2025

పెద్దగట్టు జాతరకు ట్రాఫిక్ ఆంక్షలు: SRPT SP

image

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు SRPT SP సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. HYD-విజయవాడ వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా వెళ్లాలని సూచించారు. HYD-KMM వెళ్లే వాహనాలను టేకుమట్ల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయని, రూట్ మ్యాపును సిద్ధం చేశామన్నారు.

News February 11, 2025

కాంగ్రెస్ షోకాజ్ నోటీసును పట్టించుకోను: తీన్మార్ మల్లన్న

image

కాంగ్రెస్ ఇచ్చిన షోకాజ్ నోటీసును పట్టించుకోనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్గొండలో టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు ఆయన హాజరై మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి ఓ వర్గం చేస్తున్న కుట్రనే షోకాజులు అని మండిపడ్డారు. అభ్యర్థులు పూల రవీందర్, సుందర్ రాజ్ యాదవ్‌కు బీసీలు ఓట్లు వేసుకున్నా బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నారు. ఇతర వర్గాలకు చెందిన వారికి డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు.