Nalgonda

News July 10, 2024

రూ.100 కోట్లతో సూర్యాపేట అభివృద్ధి: పటేల్ రమేష్ రెడ్డి

image

రూ.100 కోట్లతో సూర్యాపేటని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సూర్యాపేటకు వచ్చిన సందర్భంగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉండ్రుగొండ, పిల్లలమర్రి, కాకతీయుల శివాలయాల అభివృద్ధితో పాటు మూసీ జలాశయంలో బోటింగ్‌తో కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేసి.. సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

News July 10, 2024

నాగార్జున సాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జున సాగర్ జలాశయం ప్రాజెక్టు వివరాలును అధికారులు బుధవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 503.30 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 120.5754 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది.

News July 10, 2024

పొన్నం ప్రభాకర్‌ను కలిసిన తీన్మార్ మల్లన్న

image

మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా విజయం సాధించిన సందర్భంగా మల్లన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

News July 10, 2024

చౌటుప్పల్: లారీని ఢీ కొట్టిన కారు

image

చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామ స్టేజి వద్ద విజయవాడ-హైదరాబాద్ వెళ్తున్న భారీ కంటైనర్‌ని దాటిన కారు ఓ లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై అడ్డంగా ఉన్న కంటైనర్‌ను క్రేన్ సాయంతో పక్కకు తీసేశారు.

News July 10, 2024

నల్గొండ: బీటెక్ విద్యార్థి సూసైడ్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ మరొకరి ప్రాణం తీసింది. పోచారం PS పరిధి శ్రీనిధి ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్ స్టూడెంట్ నితిన్(21) మంగళవారం రైల్‌ కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన నితిన్ కాలేజీ ఫీజు కోసం రూ.1.3 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులు బెట్టింగ్‌‌లో పోగొట్టాడు. తల్లిదండ్రులు మందలించడంతో‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 10, 2024

సూర్యాపేట: ఓటర్ ఐడీ చెల్లదు.. బస్సు దిగు..!

image

‘ఆర్టీసీ బస్సులో ఓటర్ ఐడీ చెల్లదు. టికెట్ తీసుకో లేదంటే బస్సు దిగి పో’ అంటూ తన పట్ల కండక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లు నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వగ్రామానికి వెళ్లేందుకు మంగళవారం కోదాడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కానని , సదరు కండక్టర్ ఓటర్ ఐడీ చెల్లదంటూ మధ్యలోనే దించేశారని బాధితురాలు వాపోయారు.

News July 10, 2024

నేడు దేవరకొండకు జగన్నాథ రథయాత్ర

image

ఇస్కాన్ టెంపుల్ కూకట్‌పల్లి వారి ఆధ్వర్యంలో చేపట్టిన పూరి జగన్నాథ రథయాత్ర బుధవారం దేవరకొండ పట్టణానికి చేరుకోనుంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన కమిటీ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు పట్టణానికి చేరుకోనున్న రథయాత్ర స్థానిక అయ్యప్పస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై కొండల్రావు బంగ్లా వరకు కొనసాగనుంది. అనంతరం రాత్రి 7గంటలకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

News July 10, 2024

SRPT: చికిత్స పొందుతూ బాలిక మృతి

image

పురుగు మందు తాగిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాలు మేరకు.. సూర్యాపేటకు చెందిన బాలిక(15) మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఈనెల 6న పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు సీఐ తెలిపారు.

News July 10, 2024

నల్గొండ: ప్రాణం తీసిన గడ్డివాము పంచాయతీ

image

అనంతగిరి మండలం వెంకట్రాంపురంలో గడ్డి వాము పంచాయతీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లె సుధాకర్, తుళ్లూరు అచ్చయ్య గడ్డివాము విషయంలో గొడవపడ్డారు. అచ్చయ్య సుధాకర్‌ను నెట్టి వేయగా సుధాకర్ తలకు తీవ్ర గాయమైంది. హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతగిరి ఎస్ఐ తెలిపారు.

News July 10, 2024

18న సూర్యాపేట పోస్ట్ ఆఫీసులో ఇంటర్వ్యూలు

image

తపాలా శాఖలో కమిషన్ ప్రాతిపదికన పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18న సూర్యాపేట పోస్ట్ ఆఫీస్‌లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సూర్యాపేట డివిజన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి.సైదులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట డివిజన్‌లోని 347 పోస్ట్ ఆఫీసులు పరిధిలో 18 ఏళ్లు నిండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.