India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ అకాడమీ (NAC) ఉచిత శిక్షణతో పాటు 100% ఉపాధి కల్పించనుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎలక్ట్రీషియన్, సూర్యమిత్ర సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 90 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ఆసక్తి గల వారు నల్గొండ ఐటీఐలోని NAC కార్యాలయంలో లేదా 7893332674, 8297431655 నంబర్లలో సంప్రదించవచ్చు.

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేయగా, మొత్తం 27,018 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించి త్వరగా భూసేకరణ ప్రక్రియ ముగించాలని స్పష్టం చేశారు.

నల్గొండ హాలియా సాగర్ ఎడమ కాలువ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని లారీ వేగంగా ఢీకొనడంతో పెద్దవూర మండలం కొత్తగూడెంకు చెందిన భార్యాభర్తలు వెంకటయ్య(55), మల్లమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. హాలియా నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సీఐ సతీష్ రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.